Home /News /national /

INDIAN ORIGIN WOMAN NOW CANCER FREE AFTER DRUG TRIAL IN UK UMG GH

Cancer Survived Women: వైద్య శాస్త్రంలో అద్భుత ఘట్టం.. క్యాన్సర్ తగ్గిపోయింది.. ఈ భారతీయ మహిళే సజీవ సాక్ష్యం...

క్యాన్సర్ నుంచి కోలుకొని కుటుంబంతో ఉన్న మహిళ (Image: )

క్యాన్సర్ నుంచి కోలుకొని కుటుంబంతో ఉన్న మహిళ (Image: )

బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఫాలోఫీల్డ్‌కు చెందిన జాస్మిన్ డేవిడ్(51) అనే భారత సంతతి మహిళ.. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ట్రయల్ తర్వాత క్యాన్సర్‌ను పూర్తిగా జయించింది. 2017 నవంబర్‌లో ఆమె ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము క్యాన్సర్

ఇంకా చదవండి ...
సుదీర్ఘమైన క్యాన్సర్‌ చికిత్సలను ఎదుర్కొని క్యాన్సర్‌ నుంచి బయటపడిన ఆమెకు.. కొంత కాలానికే క్యాన్సర్‌ మళ్లీ సోకిందనే వార్త వినిపించింది. చికిత్స తీసుకోవచ్చని భావిస్తున్న తరుణంలో.. క్యాన్సర్‌ ఊపిరితిత్తులకు సోకిందని, కొన్ని నెలలో జీవిస్తారనే పిడుగులాంటి వార్తను వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో అనూహ్యంగా క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనాలని కొందరు పరిశోధకులు తనను సంప్రదించడం ఆమెకు వరంలా మారింది. ఆ ప్రయోగాత్మక ఔషధమే ఆమెకు సంజీవని అయింది. కొన్ని నెలలే బతుకుతారనే మాటలు విన్న ఆమెకు.. క్యాన్సర్‌ను జయించారనే మాటలూ వినే అదృష్టం దక్కింది. శరీరంలో క్యాన్సర్‌ కణాలు లేవని తేలడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. కుటుంబంతో కలిసి సంభరాలు జరుపుకొంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఫాలోఫీల్డ్‌కు చెందిన జాస్మిన్ డేవిడ్(51) అనే భారత సంతతి మహిళ.. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ట్రయల్ తర్వాత క్యాన్సర్‌ను పూర్తిగా జయించింది. 2017 నవంబర్‌లో ఆమె ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము క్యాన్సర్ ఉందని పరీక్షల్లో తేలింది. ఆమె 2018 ఏప్రిల్‌లో ఆరు నెలల కీమోథెరపీ, మాస్టెక్టమీ చేయించుకున్నారు. ఆ తర్వాత 15 సైకిల్స్ రేడియోథెరపీ చేయించుకున్నారు. దీంతో ఆమె విజయవంతంగా క్యాన్సర్‌ నుంచి బయటపడ్డారు. తర్వాత 2019 అక్టోబర్‌లో క్యాన్సర్ తిరిగి వచ్చింది. స్కాన్‌లలో ఆమె శరీరం అంతటా అనేక గాయాలు కనిపించాయి.. ఆమెకు రోగ నిరూపణ సరిగా లేదు. క్యాన్సర్ ఊపిరితిత్తులు, శోషరస కణుపులు, ఛాతీ ఎముకలకు వ్యాపించింది. ఆమె జీవించడానికి ఒక సంవత్సరం కంటే తక్కువ సమయం ఉందనే పిడుగులాంటి వార్తను వైద్యులు ఆమెకు చెప్పారు.

ఇదీ చదవండి: నేవీ అగ్నిపథ్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి రెస్పాన్స్.. మూడు రోజుల్లోనే 10వేలకు పైగా దరఖాస్తులు


ఈ క్రమంలో రెండు నెలల తర్వాత, కొందరు పరిశోధకులు ఆమెను ఓ ప్రయోగాత్మక ఔషధం క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనమని కోరడంతో.. ఇక ఏ దారీ లేదని భావించిన ఆమె క్లినికల్ ట్రయల్‌లో పాల్గొనడానికి అంగీకరించారు. క్రిస్టీ NHS ఫౌండేషన్ ట్రస్ట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (NIHR) మాంచెస్టర్ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ (CRF)లో డేవిడ్‌కు ఓ ప్రయోగాత్మక ఔషధాన్ని అందించారు. ఇందుకు కోసం డేవిడ్‌ అంగీకరించారు. రెండు సంవత్సరాల పాటు ట్రయల్‌లో అటెజోలిజుమాబ్ అనే ఇమ్యునోథెరపీ డ్రగ్ ఇంట్రావీనస్‌గా ఇచ్చారు. మూడు వారాలకు ఒకసారి ఆమెకు డ్రగ్‌ అందించారు.

జాస్మిన్‌ డేవిడ్‌ మాట్లాడుతూ..‘నా మొదటి క్యాన్సర్ చికిత్స తర్వాత 15 నెలలపాటు నేను పూర్తిగా దాని గురించి మర్చిపోయాను. కానీ క్యాన్సర్ తిరిగి వచ్చింది. నన్ను క్లినికల్ ట్రయల్స్‌ కోసం సంప్రదించినప్పుడు.. అది పని చేస్తుందో లేదో నాకు తెలియదు. కానీ నేను ఇతరులకు సహాయం చేయడానికి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేందుకు నా శరీరాన్ని ఉపయోగించాలని క్లినికల్‌ ట్రయల్స్‌కు అంగీకరించాను. మొదట తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కొన్నాను. తలనొప్పి, ఉష్ణోగ్రతలతో హెచ్చుతగ్గులు అనుభవించాను. ఈ కారణాలతో క్రిస్మస్ అప్పుడు కూడా ఆసుపత్రిలో ఉన్నాను. ఆ తర్వాత మెల్లగా చికిత్సకు సహకరించడం ప్రారంభించాను’ అని చెప్పారు.జాస్మిన్‌ డేవిడ్‌ మాట్లాడుతూ..‘2020 ఫిబ్రవరిలో 50వ పుట్టినరోజును ట్రీట్‌మెంట్ మధ్యలోనే జరుపుకొన్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకుండానే వేడుకలు చేసుకొన్నాను. రెండున్నరేళ్ల క్రితం ఇది ముగింపు అని భావించాను, కానీ ఇప్పుడు పునర్జన్మ లభించింది. ఏప్రిల్‌లో కుటుంబాన్ని చూడటానికి భారతదేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా జీవితంలో మార్పు వచ్చింది. నేను త్వరగా పదవీ విరమణ పొందాలని నిర్ణయించుకున్నాను. దేవుడికి, వైద్య శాస్త్రానికి కృతజ్ఞతగా నా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయానికి నా కుటుంబం చాలా సపోర్ట్‌ ఇచ్చింది. సెప్టెంబరులో నా 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటాను. ఈ ప్రయాణంలో నా క్రైస్తవ విశ్వాసం నాకు చాలా సహాయపడింది. కుటుంబం, స్నేహితుల ప్రార్థనలు, సవాలును ఎదుర్కోవటానికి నాకు శక్తినిచ్చాయి.’ తెలిపారు.

2021 జూన్ నాటికి, స్కాన్‌లు ఆమె శరీరంలో కొలవదగిన క్యాన్సర్ కణాలను చూపించలేదు. ఆమెకు క్యాన్సర్ లేదని ప్రకటించారు. ఆమె 2023 డిసెంబరు వరకు ట్రయల్స్‌లో ఉండాలి. మెడికల్ ఆంకాలజిస్ట్, క్రిస్టీ, మాంచెస్టర్ CRF క్లినికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫియోనా థిస్ట్‌వైట్ మాట్లాడుతూ..‘జాస్మిన్‌కు ఇంత మంచి ఫలితం లభించినందుకు మేము నిజంగా సంతోషిస్తున్నాం. ది క్రిస్టీలో మేము కొత్త మందులు, చికిత్సలను నిరంతరం పరీక్షిస్తున్నాం. అవి మరింత మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆశిస్తున్నాం.’ అని తెలిపారు.
Published by:Mahesh
First published:

Tags: Britan, Cancer, Drugs, Uk

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు