హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

SRGC: సముద్రపు దొంగల భరతం పట్టే అత్యాధునిక అస్త్రం.. ఐఎన్ఎస్ విశాఖలో సరికొత్త గన్

SRGC: సముద్రపు దొంగల భరతం పట్టే అత్యాధునిక అస్త్రం.. ఐఎన్ఎస్ విశాఖలో సరికొత్త గన్

INS Visakha

INS Visakha

INS Visakhapatnam SRGC: INS విశాఖపట్నం యుద్దనౌకకు ఇప్పుడు స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్ (SRCG)లను అమర్చారు. మరి దీని శక్తి సామర్థ్యాలు, ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

దేశ రక్షణ వ్యవస్థపై కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మన దేశం వైపు కన్నెత్తి చూసే ప్రత్యర్థులకు సవాల్ విసిరేలా.. ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించేలా.. త్రివిధ దళాలను ఎప్పుడూ లేనంతగా బలోపేతం చేేస్తోంది. భారీగా నిధులను కేటాయిస్తూ అత్యాధునిక శక్తివంతమైన అస్త్రాలను సమకూర్చుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ నేవీకి మరో పవర్ ఫుల్ వెపన్ అందజేసింది. సముద్ర దొంగల ఆట కట్టించేందుకు.. ఉగ్రవాదుల అంతు చూసేందుకు..ఇజ్రాయెల్ తరహాలో కొత్త రకం గన్‌లను అప్పగించింది. అవే.. స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్..! సింపుల్‌గా SRGC అని పిలుస్తారు.

INS విశాఖపట్నం యుద్దనౌకకు ఇప్పుడు స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్(SRCG)లను అమర్చారు. ఈ SRCG మెరుగైన కచ్చితత్వంతో చిన్న లక్ష్యాలను సైతం గుర్తించగలదు. ఈ నవంబరులో భారత నౌకా దళం INS విశాఖపట్నం యుద్ధనౌకను ప్రారంభించింది. ఇది భారత నౌకాదళానికి ప్రపంచ స్థాయి రక్షణ సామర్థ్యాలను అందజేసింది. అంత శక్తివంతంగా దీనిని రూపొందించారు. బిల్ట్ ఇన్ స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్ (SRCG)తో వచ్చిన మొదటి తరం వార్ షిప్‌లలో INS విశాఖపట్నం ఒకటి. సముద్రపు దొంగలు, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవడానికి SRCG సిస్టమ్‌ను ఇండియన్ నేవీ అభివృద్ధి చేసింది.

Aadhaar: పుట్టిన వెంటనే ఆధార్ కార్డ్.. ఒకే ఒక్క క్లిక్.. ఆస్పత్రుల్లోనే జారీ

ఎల్బిట్‌ అనే ఇజ్రాయెల్ కంపెనీతో ట్రాన్స్‌ఫర్-ఆఫ్-టెక్నాలజీ ఒప్పందం ప్రకారం ఈ అత్యాధునిక గన్‌లను రూపొందించారు. ఈ జూన్‌లో తిరుచిరాపల్లిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్స్‌కు SRCG సిస్టమ్స్‌ను అప్పగించింది. మొదటి బ్యాచ్‌లో మొత్తం 25 సిస్టమ్స్‌ను అందజేసింది.

SRCG అంటే ఏంటి?

SRCG.. రిమోట్ వెపన్ సిస్టమ్ (RWS) కేటగిరీకి చెందిన వెపన్ అని నిపుణులు చెబుతున్నారు. సముద్ర భద్రత విషయంలో రిమోట్ వెపన్ సిస్టమ్ అనేది, రిమోట్ కంట్రోల్ ద్వారా కాల్చే తుపాకీ కంటే మెరుగైనది. శక్తివంతమైనది. SRCG కంప్యూటరైజ్డ్ టార్గెటింగ్ సిస్టమ్, ఓడ రోల్, పిచ్‌లను సమన్వయం చేసుకోగలదు. అంటే ఓడ కదలికలు గుర్తిస్తూ.. వేగాన్ని అంచనా వేయగలదు. అంతేకాదు అత్యంత ఖచ్చితత్వంతో లోపాలను తగ్గించడానికి దాని ఎలివేషన్, ట్రావర్స్ సెట్టింగ్స్‌ను మార్చుకోగలదు. మాన్యువల్‌గా ఆపరేట్ చేసే ఆయుధాను.. కదిలే ఓడలో నిమిషాల వ్యవధిలో సర్దుబాటు చేసి వినియోగించడం కుదరదు. కానీ ఇది అలాకాదు. ఫుల్లీ ఆటోమేటెడ్ గన్..! ఏదైనా శత్రు నౌక కనిపిస్తే.. నిమిషాల్లోనే వాటిని టార్గెట్ చేసి ఫినిష్ చేయగలదు. ఈ రిమోట్ వెపన్ సిస్టమ్స్‌ను ఫాస్ట్ ఫైరింగ్ రేట్‌ల కోసం కాకుండా.. అధిక కచ్చితత్వాన్ని కలిగి ఉండేలా రూపొందించారు. అందువల్ల SRCG వంటి సిస్టమ్స్‌.. AK-630 గన్స్ మాదిరిగా కాకుండా ప్రతి నిమిషానికి కొన్ని వందల రౌండ్ల మందుగుండు సామగ్రిని పేల్చగలవు.

Kidney Stones: రోగి కిడ్నీ నుంచి 150 రాళ్లు తొలగింపు.. సర్జరీ చేయకుండా.. దేశంలోనే తొలిసారి

AK-630 అనేది ఒక పెద్ద తుపాకీ. ఇది నిమిషానికి 5,000 రౌండ్లు ఫైరింగ్ చేయగలదు. ఇది తన వైపు దూసుకువస్తున్న యాంటీ షిప్‌ మిసైల్స్‌ను సైతం షూట్ చేయగలదు. ఇది అంత పవర్ ఫుల్ అన్నమాట. SRCG సిస్టమ్‌లో 12.7mm గన్‌, ఆప్ట్రానిక్ కెమెరా, లేజర్ రేంజ్ ఫైండర్‌ ఉంటాయి. దీని సెన్సార్‌ల ద్వారా ఏదైనా వాతావరణంలో లేదా రాత్రి సమయంలో లక్ష్యాలను సులభంగా గుర్తించి, ట్రాక్ చేయవచ్చు. సముద్రపు దొంగలు, ఉగ్రవాదులు ఎక్కువగా ఉపయోగించే చిన్న, వేగంగా కదిలే పడవలపై కాల్పులు జరపడానికి SRCGలను రూపొందించినట్లు నిపుణులు చెబుతున్నారు.

పైరేట్స్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు SRCG ఎలా సహాయం చేస్తుంది?

సముద్రపు దొంగలు, ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో SRCG సిస్టమ్ ప్రధాన పాత్ర పోషించిందని నివేదికలు చెబుతున్నాయి. పైరేట్స్ కూడా భారీ మెషిన్ గన్లు, రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్లు వంటి ఆయుధాలు సంపాదించినట్లు చాలా సందర్భాల్లో తెలిసింది.  అందువల్ల సముద్రపు దొంగలు లేదా స్మగ్లర్లను ఆపడానికి, వార్నింగ్ షాట్స్ కాల్చడానికి.. 76mm మెయిన్ గన్ లేదా ఫాస్ట్ ఫైరింగ్ AK-630 గన్స్ వంటి మాన్యువల్ మెషిన్ గన్స్ అనువైనవి కావు. కానీ కంప్యూటరైజ్డ్ టార్గెట్స్‌ ఉండే SRCGలు వార్నింగ్ షాట్స్ ఫైర్ చేయడానికి, హై వాల్యూ టార్గెట్స్‌ను చేధించడానికి అనుకూలమైని. SRCGలోని ఆప్ట్రానిక్ సెన్సార్లు, అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న లక్ష్యాలను కూడా గుర్తించగలవు

సముద్ర జలాల్లో సముద్ర దొంగలతో పాటు ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత నౌకాదళం కూడా ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తోంది.

Omicron: భారత్‌లో ఒమిక్రాన్ కలకలం.. సెంచరీకి చేరువలో కొత్త వేరియెంట్ కేసులు

గత రెండు దశాబ్దాలలో, దాదాపు అన్ని ప్రధాన దేశాల నావికా దళాలు పెద్ద సంఖ్యలో రిమోట్ వెపన్ సిస్టమ్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. 2003లో US నేవీ 'టైఫూన్' RWS వేరియంట్‌ను ఏర్పాటు చేసింది. యుద్ధనౌకలపై మోహరించేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ సంస్థ దీన్ని రూపొందించింది. టైఫూన్ సిస్టమ్‌.. 7.62mm నుంచి 12.7mm, 20mm, 25mm, 30mm వంటి క్యాలిబర్స్ రేంజ్ కలిగిన వివిధ గన్స్‌ను ఉపయోగించగలదు.


South Sudan Mystery disease: మరో భయంకరమైన వ్యాధి... సౌత్ సూడాన్‌లో పిట్టల్లా రాలుతున్న జనం

2000లో అల్-ఖైదా USS కోల్‌ యుద్ధ నౌకపై ఆత్మాహుతి దాడి చేయడంతో, అమెరికా నేవీ సరికొత్త వెపన్స్ వాడకంపై నిర్ణయం తీసుకుంది.  2000 అక్టోబర్‌లో, USS కోల్ అనే అధునాతన మిసైల్ డిస్ట్రాయర్ ఇంధనం నింపుకోవడానికి యెమెన్‌లోని అడెన్‌ తీరానికి వెళ్లింది. దీంట్లో ఇంధనం నింపుతున్న సమయంలో ఉగ్రవాదులు USS కోల్‌తో పాటు ఒక చిన్న పడవను పేల్చారు.  ఈ పేలుడు కారణంగా కోల్ నౌకలోని వాటర్‌లైన్ సమీపంలో 40 అడుగుల వెడల్పుతో రంధ్రం ఏర్పడి 17 మంది అమెరికన్ నావికులు చనిపోయారు. ధ్వంసమైన యుద్ధనౌకలో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నప్పటికీ, పేలుడు పదార్థాలతో నిండిన పడవపై దాడి చేసే సామర్థ్యం దానికి లేదు. పెద్ద యుద్ధనౌకలకు చిన్న పడవలతో ఎదురయ్యే ముప్పును కూడా ఈ సంఘటన హైలైట్ చేసింది. అందుకే అలాంటి ముప్పు రాకుండ.. మన నౌకా దళంలో శక్తివంతమైన ఆయుధాలను వాడుతోంది.

First published:

Tags: Indian Navy, INS Visakha

ఉత్తమ కథలు