ఇండియన్ నేవీ డే (Indian Navy Day) సందర్బంగా నావికాదళ గీతాన్ని (Navy Anthem) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆవిష్కరించారు. భారత త్రివిధ దళాధిపతి హోదాలో నేవీ ఆంథమ్‌ని ఆమె లాంచ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నావికాదళ గీతావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గీత రచయిత ప్రసూన్ జోషి, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. 'Indian Navy Anthem: Call of the Blue Water' పేరుతో నేవీ గీతాన్ని రూపొందించారు. ప్రముఖ గీత రచయిత ప్రసూన్ జోషి (Prasoon Joshi) ఈ పాటకు లిరిక్స్ రాగా.. సింగర్ శంకర్ మహదేవన్ (Shankar mahadevan) తన గాత్రాన్ని అందించారు. శంకర్ ఏసన్ లోయ్ మ్యూజిక్ అందించగా... సంజీవ్ శివన్, దీప్లి పిళ్లై శివన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో నావికాదళ గీతం అందుబాటులో ఉంది.
PM Modi: బీజేపీకి ప్రజల మద్దతు అసాధారణం.. నూతన ఆకాంక్షలకు ప్రతిబింభమన్న ప్రధాని మోదీ
నౌకాదళానికి కొత్త జెండాను అందించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని.. ఈ వీడియో ఆరంభంలో జత చేశారు. 'అమర్త్య ఒక వీరుపుత్రుడు, బలమైన ప్రతిజ్ఞ గురించి ఆలోచించు, ప్రశంస అనేది ధర్మబద్ధమైన మతం, ముందుకు సాగి, ముందుకు సాగి, ముందుకు సాగిపో... అంటూ నావికా సైనికులతో ప్రధాని మోదీ చెప్పిన మాటలను ఇందులో కలిపారు. నావికాదళ కొత్త గీతం.. అందరి హృదయాల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. సాహిత్యం చాలా ఉద్వేగభరితంగా సాగుతుంది. మొత్తం 6 నిమిషాల 41 సెకన్ల నిడివి ఉన్న నేవీ ఆంథమ్ వీడియో.. దేశభక్తి ఉప్పొంగేలా అద్భుతంగా ఉంది.
కాగా, 1971 ఇండో-పాక్ యుద్ధంలో 'ఆపరేషన్ ట్రైడెంట్'లో నావికాదళం సాధించిన విజయాలకు గుర్తుగా.. మనదేశం ఏటా డిసెంబర్ 4ని నేవీ డేగా జరుపుకుంటుంది. ఈ ఏడాది తొలిసారిగా నేవీ డే వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ వెలుపల జరిగాయి. ఏపీలోని విశాఖపట్నంలో అత్యంత వైభంగా ఈసారి వేడుకలను నిర్వహించారు. విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో మూడు లక్షల మందికి పైగా పౌరులు నేవీ డే వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక ఈ ఏడాది భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ' ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత నౌకాదళం కూడా నేవీ డే రోజున 'ఆపరేషనల్ డిస్‌ప్లే' ద్వారా భారతదేశ పోరాట శక్తి, సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Draupadi Murmu, Indian Navy