హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian Music : వాహనాల హారన్లే కాదు.. ఇకపై విమానాలు, ఎయిర్ పోర్టుల్లో భారతీయ సంగీతం తప్పనిసరి!

Indian Music : వాహనాల హారన్లే కాదు.. ఇకపై విమానాలు, ఎయిర్ పోర్టుల్లో భారతీయ సంగీతం తప్పనిసరి!

మంత్రి సింధియాకు ఐసీసీఆర్ వినతిపత్రం

మంత్రి సింధియాకు ఐసీసీఆర్ వినతిపత్రం

దేశంలో ప్రజలు వాడుతోన్న బైక్, కారు, జీప్, ఇతరత్రా వాహనాల హారన్లుగా భారతీయ సంగీత పరికరాల శబ్దాలు మాత్రమే ఉండేలా చట్టం చేయబోతున్న కేంద్రం.. దేశీ విమాన సర్వీసులు, ఎయిర్ పోర్టుల్లోనూ భారతీయ సంగీతాన్ని మాత్రమే వినిపించేలా చర్యలు తీసుకోనుంది..

ఇంకా చదవండి ...

‘ఈ విశ్వం.. తాళమయం.. సర్వం సర్వం తాళమయం..’అన్న ఓ సినీకవి తరహాలో, ప్రస్తుతం భారతదేశాన్ని పాలిస్తోన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దేశంలో వినిపించే ప్రతి శబ్దం, చప్పుడు సైతం భారతీయతతో కూడినదే అయి ఉండాలని భావిస్తోంది. దేశంలో ప్రజలు వాడుతోన్న బైక్, కారు, జీప్, ఇతరత్రా వాహనాల హారన్లు.. ఇప్పుడున్నట్లు ‘కికీక్..’లాంటి శబ్దాలు కాకుండా భారతీయ సంగీత పరికరాల శబ్దాలు మాత్రమే ఉండేలా త్వరలో చట్టం చేయబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమధ్య ప్రకటించడం తెలిసిందే. ఇక ఇప్పుడు విమానాల వంతు వచ్చింది. మన దేశానికి చెందిన విమానయాన సంస్థల విమాన సర్వీసులు అలాగే ఎయిర్ పోర్టుల్లో భారతీయ సంగీతాన్ని మాత్రమే వినిపించేలా చర్యలకు కేంద్రం పూనుకుంది. వివరాలివి..

దేశీయ సంస్థలు నడుపుతోన్న విమానాలు, విమానాశ్రయాల్లో భారతీయ సంగీతమే వినిపించాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్), సంగీతకారులు డిమాండ్ చేశారు. ఈ చిన్న మార్పుతో దేశ ప్రజల మధ్య భావోద్వేగ బంధం బలపడుతుందని వారు భావిస్తున్నారు. ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఐసీసీఆర్ ప్రతినిధుల బృందం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. త్వరలోనే విమానాలు, విమానాశ్రయాల్లో భారతీయ సంగీతాన్ని తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఐసీసీఆర్ అధ్యక్షుడు సహస్రబుద్ధే తెలిపారు.

pm modi సంచలనం.. దేశవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్.. ఎవరూ ఊహించట్టుగా.. omicron సమీక్షలో మథనం


కేంద్ర మంత్రిని కలిసిన ఐసీసీఆర్ బృందంలో అధ్యక్షుడు సహస్రబుద్ధేతోపాటు కౌశల్ ఇనామ్‌దార్, అను మాలిక్, ఎంఎస్ కులకర్ణి, వసీఫుద్దీన్ దాగర్, రీటా గంగూలీ, షౌనక్ అభిషేకి, మాలిని అవస్థి, సంజీవ్ అభ్యంకర్ తదితరులున్నారు. కొద్ది రోజుల కిందటే వాహనాల హారన్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం తెలిసిందే.

women commandos : వీవీఐపీల భద్రత కోసం సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు.. జాబితాలో అమిత్ షా, గాంధీ పరివారంవాహనాల హారన్లను వినసొంపుగా మార్చే దిశగా యోచిస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిత్ గడ్కరీ తెలిపారు. పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, మౌత్ ఆర్గాన్, హార్మోనియం వంటి భారతీయ సంగీత సాధనాల ద్వారా రూపొందించిన ధ్వనినే వాహనాలకు హారన్లుగా ఉపయోగించేలా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం అంబులెన్సులు, పోలీస్ వాహనాలకు వినియోగిస్తోన్న సైరన్ ప్రజలకు చికాకు పుట్టించేలా ఉంటోదని, దాని స్థానంలో ఆకాశవాణి ట్యూన్ ప్రవేశపెట్టే దిశగానూ ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

First published:

Tags: Airport, Flight, India, Music

ఉత్తమ కథలు