Home /News /national /

ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా డ్రోన్ దాడి... కేరళలో ఐసిస్ కలకలం

ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా డ్రోన్ దాడి... కేరళలో ఐసిస్ కలకలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ISIS : కేరళ పోలీసులు, నిఘా వర్గాల ప్రకారం... ముహాసిన్ మరణ వార్త... ఆయన కుటుంబ సభ్యులకు జులై 23న ఆప్ఘనిస్థాన్‌లోని ఓ ఫోన్ నంబర్ ద్వారా చేరింది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్హార్ ప్రావిన్స్‌లో... జులై 18న ఆమెరికా డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో కేరళకు చెందిన మహమ్మద్ ముహాసిన్ చనిపోయినట్లు అమెరికా నిఘావర్గాలు తెలిపాయి. ఐసిస్‌కి చెందిన విభాగం... ఖొరాసన్‌లో... 59 మంది పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నట్లు అమెరికా చెబుతోంది. కేరళలోని... మలప్పురం జిల్లాలో ఉన్న ఇడప్పల్ టౌన్‌రి చెందినవాడు ముహాసిన్. ఈ దాడిలో ముహాసిన్‌తోపాటూ... పాకిస్థానీ ఐసిస్ కమాండర్ హుజైఫా అల్ బకిస్తానీ కూడా చనిపోయాడని తెలిసింది. ఇండియాలో ఐసిస్ తరపున పనిచేస్తున్న దాయెష్‌లో ఇతను ప్రధాన ఆన్‌లైన్ రిక్రూటర్‌గా ఉన్నాడు. కేరళ పోలీసులు, నిఘా వర్గాల ప్రకారం... ముహాసిన్ మరణ వార్త... ఆయన కుటుంబ సభ్యులకు జులై 23న ఆప్ఘనిస్థాన్‌లోని ఓ ఫోన్ నంబర్ ద్వారా చేరింది.

కేరళలోని యువతను ఐసిస్ తనవైపు తిప్పుకుంటోందని ముహాసిన్ మరణం ద్వారా తెలుస్తోంది. ఐసిస్ రిక్రూట్ చేసుకునేవారిలో ఎక్కువ మంది పశ్చిమ ఆసియా... ముఖ్యంగా సౌదీ అరేబియా, UAE, ఖతార్, ఒమన్ నుంచీ ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటోంది.

కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ప్రకారం... జూన్ 15 నుంచీ ఇప్పటివరకూ 98 మంది ఆప్ఘనిస్థాన్‌లోని ఐసిస్‌లో చేరారు. వాళ్లలో చాలా మంది పశ్చిమ ఆసియా వాళ్లే. కేరళలోని కన్నూర్ జిల్లా నుంచీ 39 మంది ఐసిస్‌లో చేరగా... వారిలో 15 మంది చనిపోయారని... నిఘావర్గాలు చెబుతున్నాయి.
Published by:Krishna Kumar N
First published:

Tags: ISIS, Kerala

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు