సౌదీలో భారతీయుడి సమాధిని తవ్వేస్తున్నారు.. రెండు నెలల క్రితమే ఇస్లాం మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేసి..

ప్రతీకాత్మక చిత్రం

ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన ఓ భారతీయుడు అనారోగ్య కారణాలతో మరణించాడు. బంధువులెవరూ లేరేమోనని సౌదీలోనే ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. రెండు నెలల తర్వాత అసలు నిజం తెలిసి..

 • Share this:
  సౌదీలో ఓ భారతీయుడు. హిందూ మతాన్ని నమ్ముతాడు. సౌదీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి అనారోగ్య కారణాలతో మరణించాడు. అతడిని స్థానిక ఆసుపత్రిలోని మార్చురీలో పెట్టారు. ఆ తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సౌదీ అధికారులు ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను పూర్తి చేశారు. నిర్దేశించిన స్థలంలో అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే అతడి మరణ వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులకు ఆ విషయం కాస్తా ఆలస్యంగా తెలిసింది. దీంతో వారు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. తమకు సమాచారం ఇవ్వకుండానే ఇలా అంత్యక్రియలు నిర్వహించడమేంటని వాపోయారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అక్కడి అధికారులతో చర్చించింది. ఇప్పుడు పూడ్చిపెట్టిన ఆ మృతదేహాన్ని మళ్లీ వెలికి తీసి భారత్ కు పంపించబోతున్నారు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సంజీవ్ కుమార్ శర్మ అనే వ్యక్తి సౌదీలో ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. జనవరి 24న అనారోగ్య కారణాలతో అతడు మరణించాడు. సౌదీలోని జినాన్ నగరంలో బైష్ ఆసుపత్రిలో అతడు చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఆ సమయంలో అనువాద సంబంధిత పొరపాట్ల వల్ల సౌదీ అధికారులు అందించిన మరణ ధృవీకరణ పత్రంలో సంజీవ్ కుమార్ శర్మ మతం ఏంటన్నది పొందుపరచలేదు. ఆ మరణ ధృవీకరణ పత్రం అరబిక్ భాషలో ఉంది. అయితే అనువాద సంబంధిత పొరపాటు వల్ల సంజీవ్ కుమార్ శర్మ ఇస్లామిక్ మతానికి చెందిన వ్యక్తిగా సౌదీలోని కాన్సులేట్ ఆఫీసులోని ట్రాన్స్ లేషట్ డిపార్ట్మెంట్ అధికారులు నమోదు చేశారు.
  ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

  అదే సమయంలో సంజీవ్ కుమార్ స్పాన్సర్ కు కూడా సమాచారం ఇవ్వకుండా ఇస్లామిక్ మతాచారం ప్రకారం జనవరి నెలలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత అతడి మృతి చెందిన విషయం గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది. అంత్యక్రియలను కూడా పూర్తి చేశారని తెలిసి వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే విదేశాంగ శాఖ ద్వారా సౌదీలోని భారతీయ కాన్సులేట్ ను సంప్రదించింది. జరిగిన పొరపాటును వారి దృష్టికి తీసుకొచ్చింది. దీంతో అక్కడి అధికారులు కూడా ఈ పొరపాటును గ్రహించారు.
  ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్

  సౌదీ అధికారులతో చర్చలు జరిపారు. సుదీర్ఘ చర్యలు, ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత అంత్యక్రియలు పూర్తయినా కూడా సంజీవ్ కుమార్ మృతదేహాన్ని తవ్వి తీసి భారత్ కు పంపించేందుకు సౌదీ అధికారులు అంగీకరించారు. ఈ విషయమై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. త్వరలోనే మృతదేహాన్ని భారత్ కు రప్పించి సంబంధీకులకు అందిస్తామని తెలియజేశారు. జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ సౌదీ కాన్సులేట్ లోని ట్రాన్స్ లేషన్ డిపార్ట్మెంట్ వారు ఓ లేఖను కూడా విడుదల చేసినట్టు వెల్లడించారు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..
  Published by:Hasaan Kandula
  First published: