ఇంధనంపై ఎక్సైజ్ సుంకం..కేంద్ర ఖజానాకు అంచనాలకు మించిన ఆదాయం

Petrol Diesel Excise Duty | పెట్రోల్, డీజిల్ అమ్మాకలపై ఎక్సైజ్ సుంకాల ద్వారా కేంద్ర ఖజానాకు ఏప్రిల్ మాసంలో రూ.10,560 కోట్ల ఆదాయంరాగా..మే మాసంలో రాబడి మూడింతలు పెరిగింది.

news18-telugu
Updated: June 24, 2020, 7:27 PM IST
ఇంధనంపై ఎక్సైజ్ సుంకం..కేంద్ర ఖజానాకు అంచనాలకు మించిన ఆదాయం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పెట్రోల్, డీజిల్‌‌ అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి రెండు మాసాల్లో వీటిపై ఎక్సైజ్ సుంకంతో కళ్లు చెదిరేలా ఏకంగా రూ.40 వేల కోట్లు వసూలు చేసింది కేంద్రం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నిర్ధేశించుకున్న ఎక్సైజ్ సుంకం లక్ష్యంలో తొలి రెండు మాసాల్లోనే(ఏప్రిల్, మే) ఏకంగా 16 శాతం వసూలుచేయడం విశేషం. పెట్రోల్, డీజిల్ అమ్మాకలపై ఎక్సైజ్ సుంకాల ద్వారా కేంద్ర ఖజానాకు ఏప్రిల్ మాసంలో రూ.10,560 కోట్ల ఆదాయంరాగా..మే మాసంలో రాబడి మూడింతలు పెరిగింది. మే మాసంలో ఏకంగా రూ.29,396 కోట్ల రాబడి వచ్చింది. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో దీని ద్వారా కేంద్ర ఖజానాకు రూ.40 వేల కోట్లకు పైగా రాబడి వచ్చింది. మే 5న పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్రం భారీగా పెంచడంతో పాటు లాక్‌డౌన్ సడలింపుల కారణంగా ఇంధన అమ్మకాలు జోరందుకోవడం దీనికి కారణమవుతున్నాయి.

మే 5న లీటర్ పెట్రోల్‌పై రూ.10లు, లీటరు డీజిల్‌పై రూ.13లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంతకు ముందు వరకు లీటర్ పెట్రోల్‌ అమ్మకంపై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.22.98ల ఆదాయం వస్తుండగా...మే 5న సుంకం పెంపు ద్వారా ఇది రూ.32.98కి పెరిగింది. అలాగే లీటరు డీజిల్‌ అమ్మకంపై ఎక్సైజ్ సుంకం ద్వారా గతంలో రూ.18.83లు ఆదాయం వస్తుండగా...మే 5 తర్వాత రూ.31.83కి పెరిగింది.

today petrol price in india, today diesel price in india, petrol price in hyderabad, petrol price hyderabad, diesel price in hyderabad, petrol price in telangana, petrol price in andhra pradesh, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు, హైదరాబాద్ పెట్రోల్ డీజిల్ ధరలు, తెలంగాణ పెట్రోల్ డీజిల్ ధరలు, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ ధరలు
(ప్రతీకాత్మక చిత్రం)


ఏప్రిల్ మాసంతో పోలిస్తే...లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో మే మాసంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ మాసంలో డీజిల్ వినియోగం 32.50 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండగా...మే మాసంలో ఇది 54.95 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అలాగే ఏప్రిల్ మాసంలో దేశంలో పెట్రోల్ విక్రయాలు 9.7 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండగా...మే మాసంలో ఇది 17.69 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. లాక్‌డౌన్ షరతుల సడలింపుల తర్వాత పెట్రోల్, డీజిల్ వినియోగం దాదాపు 90 శాతం మేర పెరిగాయి.

లాక్‌డౌన్ కారణంగా 82 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను యధాతథంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు...జూన్ 7 నుంచి ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా బుధవారం ఢిల్లీ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర కంటే ఎక్కువకు డీజిల్ ధర చేరుకోవడం విశేషం. బుధవారం ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరను యధాతథంగా ఉంచగా...లీటరు డీజిల్‌‌పై వరుసగా 18వ రోజు 48 పైసలు పెంచారు. దీంతో అక్కడ లీటరు పెట్రోల్ రూ.79.76గా ఉండగా...డీజిల్ ధర రూ.79.88కి పెరిగింది. గతంలో లీటరు పెట్రోల్ కంటే డీజిల్ ధర దాదాపుగా రూ.30ల మేర తక్కువగా ఉండేది.

today petrol price in india, today diesel price in india, petrol price in hyderabad, petrol price hyderabad, diesel price in hyderabad, petrol price in telangana, petrol price in andhra pradesh, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు, హైదరాబాద్ పెట్రోల్ డీజిల్ ధరలు, తెలంగాణ పెట్రోల్ డీజిల్ ధరలు, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ ధరలు
ప్రతీకాత్మక చిత్రం


అటు పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలపై విధిస్తున్న వ్యాట్‌ను పెంచుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు కూడా భారీగా ఆదాయం వస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాకు ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు పలు రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్‌ను భారీగా పెంచాయి. ఎక్సైజ్ సుంకం, వ్యాట్ కలుపుకుని ఇంధన ధరలపై పన్నులు ప్రస్తుతం ఏకంగా 70 శాతానికి చేరాయి. అంటే పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు మనం వెచ్చించే రూ.100ల్లో రూ.70లు పన్నులే కావడం విశేషం.
First published: June 24, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading