Home /News /national /

INDIAN GOVERNMENT WARNING TO TWITTER REGARDING REMOVAL OF MODI PLANNING FARMER GENOCIDE HASHTAG AK

వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు.. ట్విట్టర్‌కు కేంద్రం వార్నింగ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతుల పరేడ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల తరువాత ఈ కొందరు ట్విట్టర్‌లో ఈ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు.

    రైతు మారణహోమం పేరుతో అనేక అకౌంట్ల నుంచి పోస్టులు రావడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ రకమైన అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్‌కు తెలిపింది. అయితే #ModiPlanningFarmerGenocide Hashtag అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోమవారం రాత్రి నుంచి ట్విట్టర్ మళ్లీ అనుమతి ఇచ్చింది. దీంతో ట్విట్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం.. తమ ఆదేశాలను పాటించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ రకమైన హ్యాష్‌ట్యాగ్ ద్వారా చేస్తున్న పోస్టులు విద్వేషంతో పాటు సమాజంలో అశాంతిని పెంచుతాయని ప్రభుత్వం పేర్కొంది. మారణహోమం అనేది భావస్వేచ్ఛ కాదని.. అది శాంతి భద్రతలకు ఓ ముప్పు అని తెలిపింది.

    గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతుల పరేడ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల తరువాత ఈ కొందరు ట్విట్టర్‌లో ఈ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. తన నోటీసులో అరడజనకు పైగా సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. ఈ అంశంలో ట్వీట్టర్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశాల అనంతరం సుమారు 100 ట్విట్టర్ అకౌంటర్లు, 150 ట్వీట్లను సోమవారం ఉదయం ట్వీట్టర్ తొలిగించింది.

    ట్విట్టర్ బ్లాక్ చేసిన అకౌంట్లలో కిసాన్ ఏక్తా మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్, ద కార్వాన్ మ్యాగజైన్, ప్రసార భారతి సీఈవో శశిశేఖర్ వెంపటి, ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే జర్నల్ సింగ్ సహా పలువురు ఉన్నారు. అనేక దేశాల్లోని చట్టాలు ట్విట్టర్ ఖాతాలకు ట్వీట్లకు వర్తిస్తాయని ట్విట్టర్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రజలకు తమ సర్వీసులు అందుబాటులో ఉండే క్రమంలో అధికార వర్గాల నుంచి వచ్చిన సూచనలు, దేశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Farmers Protest, Twitter, Union government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు