HOME »NEWS »NATIONAL »indian flag installed at united national security council stakeout as it begins its 8th term as non permanent member nk

Republic Day 2021: భారత త్రివర్ణ పతాకకు అరుదైన గౌరవం..ఎక్కడంటే?

Republic Day 2021: భారత త్రివర్ణ పతాకకు అరుదైన గౌరవం..ఎక్కడంటే?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత జాతీయ జెండా (image credit - ANI)

Republic Day 2021: ఇటీవల భారత జాతీయ పతాకకు అరుదైన గౌరవం దక్కింది.  భారతీయులకు గర్వకారణమైన ఓ ఘటన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC))లో చోటుచేసుకుంది. 

  • Share this:
    Indian flag at UNSC: ఇటీవల భారత జాతీయ పతాకకు అరుదైన గౌరవం దక్కింది.  భారతీయులకు గర్వకారణమైన ఓ ఘటన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC))లో చోటుచేసుకుంది.  అక్కడి భారత దేశ ప్రాంగణంలో... జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇకపై ఈ జెండా ఎప్పటికీ అక్కడ ఉంటుంది. ఇది ఇండియాకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వబోతోంది. ఈ నెల 4న ఈ జెండాను ఏర్పాటు చేయడానికి ఓ ప్రధాన కారణం ఉంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ 8వ సారి అశాశ్వత (తాత్కాలిక) సభ్యదేశంగా (non-permanent member) చేరిన సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. "ఇండియా 8వ సారి సభ్యత్వాన్ని పొందింది. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా దేశానికీ, ఇక్కడి మా బృందానికీ గర్వకారణం. భద్రతా మండలిలో నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు కలిగించినందుకు భారత ప్రధానమంత్రికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని భద్రతామండలిలో భారత్ తరపున శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి తెలిపారు.

    ఐతే... రెండేళ్లుగా భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్న బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండొనేసియా, సౌత్ ఆఫ్రికాలు ఇప్పుడు సభ్యత్వాన్ని కోల్పోయాయి. ఆ దేశాలకు భారత్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే... తనతోపాటూ... రెండేళ్లు సభ్య దేశాలుగా ఎంటర్ అవుతున్న ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాలకు భారత్ స్వాగతం తెలిపింది. ఇకపై ఈ దేశాలతో కలిసి ఇండియా ముందుకు సాగనుంది. ప్రపంచ దేశాలు తీసుకునే నిర్ణయాలపై భారత్ తనదైన ముద్ర వేయనుంది.







    ఇంతకు ముందు ఇండియా... 7వ సారి... 2011-2012లో భద్రతా మండలిలో సభ్యదేశంగా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 2 ఏళ్లు సభ్యురాలిగా ఉండే అవకాశం దక్కింది.
    Published by:Krishna Kumar N
    First published:January 25, 2021, 23:01 IST

    टॉप स्टोरीज