• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIAN ECONOMY EXPECTED TO GROW AT 7 2 IN 2018 19 AS MANUFACTURING AGRICULTURE SECTORS PICK UP

2018-19 జీడీపీ వృద్ది రేటు 7.2శాతంగా అంచనా!

2018-19 జీడీపీ వృద్ది రేటు 7.2శాతంగా అంచనా!

ప్రతీకాత్మక చిత్రం..

వ్యవసాయ, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో మెరుగైన ఫలితాలు కనబడటంతో ఈసారి జీడీపీ వృద్ది రేటు గణనీయంగా పెరగనున్నట్టు వెల్లడించింది.

  • Share this:
    2018-19 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ది రేటు 7.2శాతం నమోదు కానుందని కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎస్ఓ) అంచనా వేసింది. 2017-18ఆర్థిక సంవత్సరంలో 6.7శాతం నమోదైన జీడీపీ వృద్దిరేటు 2018-19 సంవత్సరానికి మరింత మెరుగై 7.2శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వ్యవసాయ, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో మెరుగైన ఫలితాలు కనబడటంతో ఈసారి జీడీపీ వృద్ది రేటు గణనీయంగా పెరగనున్నట్టు వెల్లడించింది.

    సీఎస్ఓ గణాంకాల ప్రకారం.. వ్యవసాయ రంగం, అటవీ, ఫిషింగ్ వంటి రంగాల్లో ఈ ఆర్థిక సంవత్సరం 3.8శాతం వృద్ది రేటు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇవే రంగాల్లో 3.4 శాతం వృద్దిరేటు నమోదవగా.. ఈసారి కొంతమేర పెరగనుంది. అలాగే మాన్యుఫాక్చరింగ్ రంగంలో 2017-18ఆర్థిక సంవత్సరంలో 5.7శాతం వృద్ది రేటు నమోదవగా.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 5.7శాతం వృద్ది రేటు నమోదవనున్నట్టు సీఎస్ఓ అంచనా.

    కాగా, 2015-16లో దేశ జీడీపీలో 8.2శాతం వృద్ధి రేటు నమోదవగా.. 2016-17లో 7.1 శాతానికి తగ్గింది. ఇక జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావంతో 2017-18లో అది మరింత తగ్గి కేవలం 6.7శాతం వృద్ది రేటు మాత్రమే నమోదైంది.

    First published: