26/11 ముంబై (Mumbai) దాడులు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. చాలా మంది ప్రజలు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాడులు జరిగిన ప్రాంతాలను పూర్తిగా ఉగ్రవాదులు స్వాధీనంలోకి తీసుకోవడంతో, ప్రజలను బంధీలుగా చేసుకోవడంతో భద్రతా దళాలకు సవాళ్లు తప్పలేదు. భవనాల లోపల పరిస్థితులపై సరైనా అంచనా లేక వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లో భద్రతా దళాలకు ఉపయోగపడేలా ఇండియన్ డిఫెన్స్ సైంటిస్టులు ‘ర్యాట్ సైబోర్గ్స్’ అని అభివృద్ది చేశారు. ఇవి సులువుగా భవనాల లోపలకు ప్రవేశించి లైవ్ వీడియో ఫీడ్‌ను అందించగలవు.
* అవి ల్యాబ్ ఎలుకలే!
ర్యాట్ సైబోర్గ్స్‌ను హైదరాబాద్‌కు చెందిన కొందరు యువ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇవి ప్రామాణిక ప్రయోగశాల ఎలుకలే. శాస్త్రవేత్తలు వాటి మెదడుల్లో బయటి నుంచి సంకేతాలను స్వీకరించగల ఎలక్ట్రోడ్‌ను ఏర్పాటు చేశారు. లైవ్ ఇమేజ్‌లను తీయడానికి వెనుక భాగంలో ఒక చిన్న కెమెరా ఉంటుంది.
ఇలాంటి సదుపాయాలతో ర్యాట్ సైబోర్గ్స్ ఒకసారి భవనంలోకి ప్రవేశించిన తర్వాత.. శత్రువుల కంటపడకుండా, అనుమానం రాకుండా.. అక్కడి పరిస్థితుల లైవ్ కవరేజీని అందించగలవు. గోడలపైకి ఎక్కి, ప్రతి గది మూలకు వెళ్లి వీడియో ఫీడ్‌ను ఇవ్వగలవు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎక్స్‌టర్నల్ సిగ్నల్స్‌ను కూడా రిసీవ్ చేసుకుని, వాటి ఆధారంగా ప్లాన్స్ అమలు చేసేలా ర్యాట్ సైబోర్డ్స్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.
* రోబోలకు ఉత్తమ ప్రత్యామ్నాయం
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108వ సెషన్‌లో హైదరాబాద్‌లోని DRDO యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీ (DYSL) డైరెక్టర్ పి.శివ ప్రసాద్ అసిమెట్రిక్ టెక్నాలజీస్ (asymmetric technologies)పై ప్రజెంటేషన్ ఇచ్చారు. సెమీ-ఇన్వేసివ్ బ్రెయిన్ ఎలక్ట్రోడ్‌ల ద్వారా ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌తో ఎలుకలను ఉపయోగించుకుని ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడమేనని చెప్పారు.
ఇది కూడా చదవండి : 2024 జనవరి 1న అయోధ్యలో రామమందిరం సిద్ధం.. ప్రకటించిన హోంమంత్రి అమిత్ షా
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడంలో రోబోలకు పరిమితులు ఉన్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా DYSL అభివృద్ధి చేస్తున్న స్ట్రాటెజిక్ టెక్నాలజీస్‌లో ర్యాట్ సైబోర్డ్స్ భాగమని పేర్కొన్నారు. ఎలుకలు మరింత ఫ్లెక్సిబుల్ ఆప్షన్ అని వివరించారు.
శివ ప్రసాద్ డెక్కన్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ..‘సెకండ్ ఫేజ్‌లో మేము నాన్-ఇన్వాసివ్‌గా వెళ్తాము. మెదడులో ఎలక్ట్రోడ్‌ను చొప్పించడానికి బదులుగా, లేజర్ ట్రాన్స్-రిసీవర్‌తో కూడిన ఒక చిన్న PCBని ఎలుక పుర్రె పైన అమర్చుతాం. దాన్ని బయటి నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేయగలం. ఎలుక తనకు అందే సిగ్నల్స్‌కు అనుగుణంగా కుడి, ఎడమలకు కదలడం వంటివి చేస్తుంది’ అని చెప్పారు. పరిశోధకులు మొదటి దశలో బేస్‌లైన్ డేటాను సేకరిస్తున్నారు.
* 2019లోనే చైనాలో మొదలు
ఎలుక-సైబోర్గ్ టెక్నాలజీని 2019లో చైనా శాస్త్రవేత్తల బృందం బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీని ఉపయోగించి, ఎలుకల మెదడును ఎక్స్‌టర్నల్ స్టిములస్‌తో నియంత్రించడానికి ప్రయత్నించింది. చైనీస్ బృందం అటువంటి ఆరు ఎలుకలను ఒక ప్రయోగం కోసం ఉపయోగించింది. మొదటి దశలో మలుపులు తిరగడంలో ఎలుకలకు సులువైన ఆదేశాలు ఇచ్చారు. క్రమేణా కఠినమైన ఆదేశాలు ఇచ్చి పరిశీలించారు. మొత్తంమీద ఆశాజనక ఫలితాలు ఉన్నాయని, రెండు ఎలుకలు సక్రమంగా సిగ్నల్స్‌ను పాటించలేదని ప్రముఖ పీర్-రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ చైనీస్ అధ్యయనం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DRDO, National News, Rats