హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Saurav gunguly corona positive: బీసీసీఐ అధ్యక్షుడు​ సౌరభ్​​​ గంగూలీకి కరోనా పాజిటివ్​.. ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు 

Saurav gunguly corona positive: బీసీసీఐ అధ్యక్షుడు​ సౌరభ్​​​ గంగూలీకి కరోనా పాజిటివ్​.. ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు 

కొద్దిరోజులుగా రాజకీయ నాయకలే కాకుండా పలువురు సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సైతం కరోనా వచ్చింది. ఆయనకు కరోనా వచ్చినట్లు మంగళవారం తెలిసింది.

  దేశంలో ఒమిక్రాన్ (Omicron)​ నేపథ్యంలో కరోనా ఉధృతి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా రాజకీయ నాయకులే కాకుండా పలువురు సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ (Saurav Gunguly)కి సైతం కరోనా వచ్చింది. ఆయనకు కరోనా వచ్చినట్లు మంగళవారం తెలిసింది.

  కొద్దిరోజుల కిందటే గంగూలీకి గుండెపోటు..

  కరోనా పాజిటివ్​ రావడంతో గంగూలీ (Saurav gunguly corona positive) కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఇప్పటికే గంగూలీకి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇపుడు కరోనా రావడం తో కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. కాగా, కొద్దిరోజుల కిందటే గంగూలీకి గుండెపోటు (Heart Attack) వచ్చిన విషయం తెలిసిందే. జనవరి 2021లో, సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది, ఆ తర్వాత అతను కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. సౌరవ్ గంగూలీకి నెలలో రెండుసార్లు యాంజియోప్లాస్టీ (Angioplasty) చేయించుకోవాల్సి వచ్చింది. దాదా హార్ట్‌లో మూడు బ్లాక్స్ గుర్తించిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి ఒక స్టెంట్ వేయడంతో దాదాకు ప్రాణాపాయం తప్పిన విషయం తెలిసిందే. ఇపుడు కరోనా రావడంతో కుటుంబసభ్యులు (family members) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

  కాగా, గంగూలీ త్వరగా కోలుకోవాలని పలువురు ట్విటర్​లో పోస్టుచేశారు. బోరియా మజుందార్​, వివేక్​ ఒబేరాయ్​ తదితరులు ట్వీట్లు చేశారు.

  కాగా, గంగూలీ ఇదివరకే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్​ వేయించుకున్నాడు. చాలారోజులుగా క్రికెట్​ సంబంధిత సమావేశాల్లో గంగూలీ పాల్గొంటూ వస్తున్నారు.

  సుదీర్ఘ కాలం కెప్టెన్​గా..

  ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్‌ (captain)గా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. గంగూలీ హయాంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. గంగూలీ 113 టెస్ట్, 311 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 11,363 పరుగులు చేశారు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్ట్‌ల్లో 7,212 రన్స్ సాధించాడు గంగూలీ. ఇందులో 16 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ గంగూలీకి మంచి రికార్డే ఉంది.

  వన్డేల్లో 100, టెస్టుల్లో 32 వికెట్లను పడగొట్టాడు ఈ బెంగాల్ దాదా. 2012 వరకూ ఐపీఎల్‌లోనూ ఆడారు. 2008-10 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, 2011-12 వరకు పుణె వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

  First published:

  Tags: Corona, Sourav Ganguly

  ఉత్తమ కథలు