హిమాలయాల్లో హనుమంతుడు కనిపించాడా... 20 అడుగుల ఎత్తు ఉన్నాడా... ఇండియన్ ఆర్మీ సంచలన ట్వీట్...

Indian Army and Yeti : భారీ మనిషి ఆకారంలో యతి అనే జీవులు హిమాలయాల్లో ఉంటున్నాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. తాజాగా ఆ జీవికి సంబంధించిన పాద ముద్రలుగా ఇండియన్ ఆర్మీ చూపిస్తున్న ఫొటోలు... ఆసక్తి రేపుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 30, 2019, 4:52 PM IST
హిమాలయాల్లో హనుమంతుడు కనిపించాడా... 20 అడుగుల ఎత్తు ఉన్నాడా... ఇండియన్ ఆర్మీ సంచలన ట్వీట్...
మమ్మీ 3 సినిమాలో ఓ దృశ్యం (Image : Twitter)
  • Share this:
హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయస్వామి దాదాపు 18 అడుగుల ఎత్తు ఉంటారనీ, ఆయన హిమాలయాల్లో ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారని చాలా మంది రుషులు, జ్ఞానులూ చెబుతూ ఉంటారు. ఆంజనేయస్వామి అంత ఎత్తుతో... ప్రత్యేక మానవులు (యతి) హిమాలయాల్లో ఉంటున్నారని కొన్నేళ్లుగా ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. తాము యతిని చూశామని ఇదివరకు కొందరు అస్పష్టమైన ఫొటోలు కూడా విడుదల చేశారు. అవన్నీ గ్రాఫిక్సేనని కొట్టిపారేశారు చాలామంది. ఇక హాలీవుడ్ మూవీ మమ్మీ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా మమ్మీ టోంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపెరర్‌ (Mummy Tomb of the Dragon Emperor)లో చాలా యతిలను చూపించారు. ఈ మిస్టీరియస్ జీవి ఉందా లేదా అన్న చర్చ అలా కొనసాగుతుండగా... అది ఉంది అని నిరూపించే పాద ముద్రలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఆ ఫుట్ ఫ్రింట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. అందువల్ల ఈ జీవి లేదు అని ఇన్నాళ్లూ చెప్పిన వాళ్లు ఇప్పుడు ఆలోచనలో పడే పరిస్థితి. నిజంగా ఆ పాద ముద్రలు యతివే అయితే... అసలు అంత పెద్ద జీవి ఉందా, ఉంటే, ఇన్నాళ్లూ అది ఎవరి కంటా పడకుండా ఎలా బతుకుతోంది. ఎక్కడ జీవిస్తోంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.


మంచు మనిషిగా చెప్పే ఆ జీవి... ఒంటి నిండా జూలుతో ఉంటుందట. దాదాపు పెద్ద సైజు ఎలుగుబంటి, చింపాజీ కలగలిపినట్లు కనిపిస్తుందట. అది నల్లగా ఉంటుందని కొందరు, కాదు తెల్లగా మెరుస్తూ ఉంటుందని మరికొందరూ చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇండియన్ ఆర్మీకి చెందిన పర్వతాల అధిరోహణ బృందం... పర్వతాలపై ప్రత్యేక పాద ముద్రల్ని చూసింది. అవి ఒక్కోటీ 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పూ ఉన్నాయి. ఈ లెక్కన ఆ జీవి దాదాపు 15 అడుగుల నుంచీ 20 అడుగుల ఎత్తు ఉండి ఉండాలి. ఏప్రిల్ 9న ఈ పాద ముద్రల్ని ఫొటోలు తీసినట్లు ఆర్మీ చెబుతోంది. ఇంతకు ముందు మకాలూ-బారున్ నేషనల్ పార్కులో ఈ జీవి కనిపించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అదే ప్రదేశంలో ఈ పాదముద్రలు కనిపించడం విశేషం.

Indian Army, yeti, foot prints, snowman, daily mail, hanuman, oryx, mysterious mythical beast, wolf, bear, hymalayas, యతి, ఎతి, ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం, పాద ముద్ర, ఫుట్ ప్రింట్, స్నో మాన్, హనుమంతుడు, హనుమాన్,
మమ్మీ 3 సినిమాలో ఓ దృశ్యం (Image : Twitter)
యతి అంటే ఏంటి : యతి అనేది నేపాల్‌లోని షేర్పా జాతి ప్రజలు పలికే పదం. వాళ్ల భాష ప్రకారం యతి అంటే మంచు మనిషి అని అర్థం. 1920లో ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. యతి అనే జీవులు దాదాపు 100 నుంచీ 180 కేజీల బరువు ఉంటాయనీ, హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో జీవిస్తాయనీ, అక్కడ మానవులు దాదాపు జీవించే పరిస్థితి లేదని చెబుతున్నారు.

1951లో బ్రిటీష్ పరిశోధకుడు ఎరిక్ షిప్టన్ యతి పాదముద్రని చూశానంటూ ఓ పొటో తీశాడు. నేపాల్-టిబెట్ సరిహద్దులోని మెనలంగ్ మంచు పర్వతంపై దాన్ని చూశానన్నాడు. అది ఇప్పుడు ఆర్మీ కనిపించిందని చెబుతున్న మకాలూ బారన్ నేషనల్ పార్కుకి దగ్గర్లోనే ఉంది.

Indian Army, yeti, foot prints, snowman, daily mail, oryx, mysterious mythical beast, wolf, bear, hymalayas, యతి, ఎతి, ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం, పాద ముద్ర, ఫుట్ ప్రింట్, స్నో మాన్,
ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన ఫొటోలు


హిమాలయాలతోపాటూ సైబీరియా, తూర్పు, మధ్య ఆసియాలో కూడా యతి లాంటి జీవులు ఉన్నాయని చెబుతున్నారు. యతి ఓ దైవ సమానమైన జీవి అనీ, దాదాపు తోడేలులా ఉంటుందనీ, రాయితో తయారు చేసిన భారీ ఆయుధాన్ని చేతబట్టి... విజిల్ సౌండ్ చేస్తూ వెళ్తుందని హిమాలయాల ప్రజలు నమ్ముతున్నారు.

1954లో డైలీ మెయిల్ యతి ఉందనేందుకు కచ్చితమైన ఆధారాల్ని బయటపెట్టింది. యతికి సంబంధించినవిగా కొన్ని వెంట్రుకల్ని పరిశోధకులకు ఇచ్చింది. వాటిని పరిశోధించిన శాస్త్రవేత్తలు అవి మనిషివి కాదనీ, అలాగని ఎలుగుబంటివి కూడా కాదని తేల్చారు. అంటే అవి యతివే కావచ్చన్న అంచనా మొదలైంది.

Indian Army, yeti, foot prints, snowman, daily mail, oryx, mysterious mythical beast, wolf, bear, hymalayas, యతి, ఎతి, ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం, పాద ముద్ర, ఫుట్ ప్రింట్, స్నో మాన్,
ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన ఫొటోలు


1973లో ORYX కొత్త కథనాన్ని ప్రచురించింది. యతి అనేది అసలు మంచులోనే ఉండదనీ, అక్కడ ఎంత వెతికినా దొరకదనీ, అది హిమాలయాల దగ్గరున్న అడవుల్లో తిరిగే జీవి అని రాసింది.

ఇప్పుడు ఆర్మీ విడుదల చేసిన ఫొటోల్లో కూడా... యతి సింగిల్ కాలుతో నడిచి వెళ్లినట్లు ఉన్నాయే తప్ప... రెండు కాళ్లతో వెళ్తున్నట్లు లేవు. అందువల్ల అవి యతికి సంబంధించిన పాదముద్రలేనా లేక ఎవరైనా అలా క్రియేట్ చేశారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఫొటోలు రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ కావడంతో యతి ఉందన్న అంశంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆర్మీ ట్వీట్‌పై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

4th Phase : నాలుగో దశలో రూ.785.26 కోట్ల క్యాష్, రూ.249.038 కోట్ల మద్యం, రూ.1214.46 కోట్ల డ్రగ్స్ సీజ్...

హిమాలయాల్లో యతి... 32 అంగుళాల పాదముద్రల్ని గుర్తించిన ఇండియన్ ఆర్మీ...

కుక్కను అరెస్టు చేసిన పోలీసులు... బీజేపీకి ప్రచారం చేస్తోందని...

అతి తీవ్ర తుఫానుగా ఫణి... షిప్పులు, హెలికాప్టర్లు సిద్ధం చేసిన నౌకాదళం... ఏపీపై కొంతవరకూ ప్రభావం...
First published: April 30, 2019, 4:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading