INDIAN ARMY SET TO INDUCT NEW MADE IN INDIA LANDMINES AT PAKISTAN CHINA BORDERS GH SK
Indian Army: చైనా, పాక్ బోర్డర్లో మేడ్ ఇన్ ఇండియా ల్యాండ్‌మైన్స్.. ఆర్మీకి సరికొత్త అస్త్రం
ప్రతీకాత్మక చిత్రం
Made in india landmines: భారత భూభాగంలోకి ప్రవేశించే శత్రు దేశాల దళాలు, ఉగ్రవాదులను ఖతం చేసేందుకు భారత సైన్యం సరికొత్త ల్యాండ్మైన్లను తీసుకువస్తోంది. గతంలో మందుపాతరలు చాలా బరువు ఉండేది. కానీ ఇప్పుడు తీసుకొస్తున్న నిపున్, విభవ్, విశాల్, ప్రచంద్, ఉలుక్ అనే ల్యాండ్మైన్లు చాలా తేలికగా ఉండనున్నాయి.
శత్రుదేశాల దాడులను తిప్పి కొట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే శత్రు దేశాల వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఆయుధాలను సరిహద్దుల్లో మోహరించింది. అలాగే భారత భూభాగంలోకి ప్రవేశించే శత్రు దేశాల దళాలు, ఉగ్రవాదులను ఖతం చేసేందుకు భారత సైన్యం సరికొత్త ల్యాండ్మైన్లను తీసుకువస్తోంది. గతంలో మందుపాతరలు చాలా బరువు ఉండేది. కానీ ఇప్పుడు తీసుకొస్తున్న నిపున్, విభవ్, విశాల్, ప్రచంద్, ఉలుక్ అనే ల్యాండ్మైన్లు చాలా తేలికగా ఉండనున్నాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల ద్వారా ప్రత్యర్థులు భారత భూభాగంలోకి అడుగుపెట్టేందుకు చేసే ప్రయత్నాలను మొదటిగా ఈ మందుపాతరలే అడ్డుకోనున్నాయి. స్వదేశంలోనే తయారవుతున్న ఈ సరికొత్త మైన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
“యాంటీ ట్యాంక్ మైన్ (ప్రత్యర్థి వాహనాలను ఎదుర్కొనే మందుపాతర), యాంటీ పర్సనల్ మైన్( శత్రువులను ఎదుర్కొనే మందుపాతర) నుంచి కొత్త శ్రేణి మందుపాతరల వరకు చాలా ల్యాండ్మైన్లు ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్నాయి. ఇప్పుడు వాడుతున్న మందుపాతరలు పాత కాలం నాటివి కాబట్టి వీటిని మార్చడం తప్పనిసరి అయింది” అని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే పేర్కొన్నారు. ఈ ల్యాండ్మైన్లు యూజర్ అవసరాలను తీర్చేలా రూపుదిద్దుకోగానే అవి వినియోగంలోకి వస్తాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్లు సరికొత్త యాంటీ పర్సనల్, యాంటీ ట్యాంక్ మైన్లను పొందుతున్నారని ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇవి శత్రు పదాతిదళం (foot-soldiers), సాయుధ దళాలు లేదా ఇండియాలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇప్పుడు యాంటీ ట్యాంక్, యాంటీ పర్సనల్ మైన్లు ఒక ప్రదర్శనలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రదర్శనలో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్లు ఈ స్వదేశీ పరికరాలను ప్రదర్శిస్తున్నారు.
"త్వరలోనే భారత సైన్యం ఇండియాలోనే తయారుచేసిన 7 లక్షల 'నిపున్' యాంటీ పర్సనల్ మైన్స్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఇవి శక్తివంతమైన RDX మిశ్రమాన్ని కలిగి ఉంటాయి" అని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) భాగస్వామ్యంతో భారతీయ సంస్థ ఈ మైన్స్‌ను అభివృద్ధి చేసిందని ఆయన వివరించారు.
శత్రువుల ట్యాంకులను ప్రతిఘటించేందుకు ఇంజనీర్ల బృందం విభవ్, విశాల్ మైన్స్‌ల ట్రయల్స్‌ను నిర్వహిస్తోందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవి నెక్స్ట్ జనరేషన్ మేడిన్ ఇండియా యాంటీ-ట్యాంక్ మైన్స్ కావడం విశేషం. ఈ మైన్స్‌ను డీఆర్డీఓ భారత సైన్యం కోసం అభివృద్ధి చేసింది. వీటి ట్రయల్స్ తుది దశలో ఉన్నాయి. ప్రచంద్, ఉల్కా, పార్థ్ అనే సరికొత్త ల్యాండ్మైన్లు కూడా త్వరలో రక్షణ వ్యవస్థలోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.