ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. బర్త్‌డే రోజే పైలట్ మృ‌తి..

విధులకు వెళ్తూ పుట్టిన రోజే అతడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. దాంతో రజ్నీష్ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

news18-telugu
Updated: September 27, 2019, 5:49 PM IST
ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. బర్త్‌డే రోజే పైలట్ మృ‌తి..
ఘటాన స్థలంలో హెలికాప్టర్ శకలాలు
  • Share this:
భూటాన్‌లో ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇండియన్ ఆర్మీకి చెందిన పైలట్‌తో పాటు భూటాన్ ఆర్మీకి చెందిన మరో జవాన్ మరణించాడు. చనిపోయిన భారత పైలట్‌ను లెప్టినెంట్ కల్నల్ రజ్నీష్ పార్మర్‌, భూటాన్ పైలట్‌ను కెప్టెన్ కల్జాంగ్ వాంగ్డిగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూటాన్‌లోని యాంగ్ఫుల్లా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అరుణాల్ ప్రదేశ్‌లోని ఖిర్ము నుంచి యాంగ్ఫుల్లాకు వెళ్తుండగా చేతక్ హెలికాప్టర్‌కు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

చాపర్ నుంచి సిగ్నల్ కోల్పోవడంతో ఆర్మీ అప్రమత్తమైంది. ప్రమాదం జరిగి ఉండవచ్చని ఊహించి.. యాంగ్ఫుల్ ప్రాంతంలో హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఐతే ఓ కొండ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి. సమాచారం అందిన వెంటనే భారత సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. ఐతే ఇవాళే లెఫ్టినెంట్ కల్నల్ రజ్నీష్ బర్త్ డే. విధులకు వెళ్తూ పుట్టిన రోజే అతడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. దాంతో రజ్నీష్ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 27, 2019, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading