హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాక్ సరిహద్దు నౌషేరాలో షాకింగ్ ఘటన -ఆర్మీ లెఫ్టినెంట్, జవాన్ దుర్మరణం

పాక్ సరిహద్దు నౌషేరాలో షాకింగ్ ఘటన -ఆర్మీ లెఫ్టినెంట్, జవాన్ దుర్మరణం

లెఫ్టినెంట్ రిషి, జవాన్ మన్‌జీత్‌

లెఫ్టినెంట్ రిషి, జవాన్ మన్‌జీత్‌

వరుస ఎన్ కౌంటర్లు, భీకర కాల్పులు, ఉగ్రదాడులతో అట్టుడుకుతోన్న జమ్మూకాశ్మీర్ లో మరో అనూహ్య సంఘటన జరిగింది. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి మందుపాతర పేలి ఇద్దరు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. గాయపడ్డ మరో జవాన్ పరిస్థితి విషమంగా ఉంది.

వరుస ఎన్ కౌంటర్లు, భీకర కాల్పులు, ఉగ్రదాడులతో అట్టుడుకుతోన్న జమ్మూకాశ్మీర్ లో మరో అనూహ్య సంఘటన జరిగింది. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి మందుపాతర పేలి ఇద్దరు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. గాయపడ్డ మరో జవాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి నార్తరన్ కమాండ్, వైట్ నైట్ కార్ప్స్ కమాండ్ విభాగాల ప్రతినిధులు అధికారిక ప్రకటన చేశారు. పూర్తి వివరాలివి..

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు, ఉగ్రచర్యల పట్ల జోరో టోలరెన్స్(ఏరివేత) విధానాన్ని అనుసరిస్తోన్న ఇండయన్ ఆర్మీ స్వయంగా కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించే ఆపరేషన్లకు విడిగా ఆర్మీ సైతం ఉగ్రవాదుల ఏరివేతను చేపట్టింది. ఈక్రమంలోనే పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో సైన్యం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. చాలా సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైన సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. నెలరోజులకుపైగా సాగుతోన్న ఆపరేషన్ లో ఇప్పటి వరకు రెండు వేర్వేరు ఉగ్రదాడుల్లో తొమ్మిది మంది సైనికులు వీర మరణం పొందారు. శనివారం నాటి ఘటనలో మరో ఇద్దరు అమరులయ్యారు..

జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని ఆనుకుని ఉండే నౌషేరా సెక్టార్ లో శనివారం శక్తిమంతమైన పేలుడు సంభవించింది. అక్కడి కలాల్ ప్రాంతంలో ఆర్మీ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా భారీ శబ్దంతో ల్యాండ్ మైన్ పేలింది. ఈ ఘటనలో ఆర్మీ లెఫ్టినెంట్ రిషి కుమార్, జవాన్ మన్‌జీత్‌ సింగ్, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతోన్న ఆ ముగ్గురినీ దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆస్పత్రికి తీసుకెళుతుండగానే లెఫ్టినెంట్ రిషి, జవాన్ మన్‌జీత్‌ ప్రాణాలుకోల్పోయారు. గాయపడ్డ మూడో జవాన్ పరిస్థితి విషమంగా ఉంది.

విధి నిర్వహణలో అమరులైన ఇద్దరు సిబ్బందికి ఆర్మీతోపాటు యావత్ దేశం నివాళులు అర్పిస్తోందని, వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలుపుతున్నామని ఆర్మీ అధికారిక ప్రకటన చేసింది. లెఫ్టినెంట్ రిషి స్వస్థలం బీహార్ లోని బెగూసరాయ్ కాగా, జవాన్ మన్ జీత్ పంజాబ్ లోని భతిందా జిల్లా సిర్వేవాలాకు చెందినవారు. చొరబాటుదారులను అడ్డుకునేందుకు ఏర్పాటుచేసిన ల్యాండ్ మైన్స్ ను పొరపాటున తాకడం వల్లే ఈ పేలుడు జరిగిందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ దేవంద్ర ఆనంద్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

First published:

Tags: Bomb blast, Indian Army, Jammu and Kashmir, LOC

ఉత్తమ కథలు