INDIAN ARMY CONVOY DRIVES THROUGH NEWLY BUILT ATAL TUNNEL SU
Atal Tunnel: తొలిసారిగా అటల్ టన్నెల్ గుండా ప్రయాణించిన ఆర్మీ కాన్వాయ్..
అటల్ టన్నెల్(Credit-Twitter)
హిమాలయాల్లోని రోహ్తాంగ్లో నిర్మించిన సొరంగ మార్గం అటల్ టన్నెల్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగం మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించారు.
హిమాలయాల్లోని రోహ్తాంగ్లో నిర్మించిన సొరంగ మార్గం అటల్ టన్నెల్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగం మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ టన్నెల్ గుండా ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక కాన్వాయ్ బుధవారం ప్రయాణించింది. ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ ఈ టన్నెల్ గుండా ప్రయాణించడం ఇదే తొలిసారి.9.02 కిలోమీటర్ల పొడవుగా నిర్మించిన ఈ టన్నెల్... సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఉంది. కుల్లు జిల్లాలోని మనాలీ నుంచి లాహోల్స్పిటి లోయ వరకు దీన్ని నిర్మించారు. ఈ టన్నెల్ కోసం దాదాపు రూ. 3,500 కోట్లు ఖర్చు చేశారు.
అటల్ టన్నెల్ వల్ల... మనాలీ నుంచి లఢక్ లోని లేహ్ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. పైగా... ఇది సొరంగం కావడం వల్ల దీన్లోకి మంచు రాదు. అందువల్ల దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు.ఇందులో వచ్చే, పోయే మార్గాలకు రెండు మార్గాలు ఏర్పాటు చేశారు. దీని వెడల్పు 8 మీటర్లు కాగా, ఎత్తు 5.525 మీటర్లు ఉంటుంది. అలాగే సొరంగ మార్గంలో అనేక భద్రత చర్యలు చేపట్టారు.
#WATCH: First Indian Army convoy passed through the newly-inaugurated Atal Tunnel near Manali in Himachal Pradesh, today. pic.twitter.com/bxm4VXIsDE
లఢక్, అక్సాయ్ చిన్ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఇది ఉపయోగపడనుంది. తొలుత దీనిని రోహ్తాంగ్ సోరంగం అని పిలిచేవారు.. అయితే 2019లో వాజ్పేయి పేరు మీదుగా ఈ సొరంగానికి అటల్ టన్నెల్ అని నామకరణం చేశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.