Indian-China soldires face off : డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్(Tawang)లోని యాంగ్‌స్టే ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. LAC సమీపంలో అక్రమ కంచెను నిర్మిస్తున్న చైనా ఆర్మీని నిరోధించడానికి భారత సైనికులు ప్రయత్నించినప్పుడు ఎదురుకాల్పులు జరిగాయని, డిసెంబర్ 9- 11 తేదీల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. ఎక్కువగా చైనా సైనికులే గాయపడ్డారని సమాచారం. భారత్ తో కయ్యానికి దాదాపు 300 మంది చైనా సైనికులు భారీ ప్రిపరేషన్ తో సిద్ధమయ్యారు, కానీ భారత సైన్యం దానిని ధీటుగా తిప్పికొట్టడంతో డ్రాగన్ సైన్యం బిత్తరపోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని LAC వెంబడి కొన్ని ప్రాంతాలలో భిన్నమైన అవగాహన ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, ఇందులో ఇరుపక్షాలు తమ క్లెయిమ్ లైన్‌ల వరకు ఆ ప్రాంతాన్ని గస్తీ చేస్తాయి. 2006 నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. డిసెంబర్ 9న చైనా ఆర్మీ సైనికులు.. తవాంగ్ సెక్టార్‌లోని LACని సంప్రదించగా, దీనికి భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎదురుకాల్పు వల్ల ఇరువర్గాలకు చెందిన కొంతమంది సైనికులకి స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాలు వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో శాంతి- ప్రశాంతతను పునరుద్ధరించడానికి నిర్మాణాత్మక యంత్రాంగాలకు అనుగుణంగా సమస్యను చర్చించడానికి ఆ ప్రాంతంలోని భారత కమాండర్ చైనా అధికారులతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arunachal Pradesh, India-China