హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఆ 89 యాప్స్ తొలగించండి.. లేదంటే చర్యలు.. సైనికులకు ఆర్మీ ఆదేశం

ఆ 89 యాప్స్ తొలగించండి.. లేదంటే చర్యలు.. సైనికులకు ఆర్మీ ఆదేశం

చైనా, పాకిస్థాన్ సైబర్ వార్‌కు దిగే అవకాశాలు ఉండటంతో.. ఆర్మీ ముందు జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

    ఇటీవల భద్రతా పరమైన అంశాలను సరిగ్గా పాటించడం లేదంటూ చైనాకు చెందిన టిక్‌టాక్, హలో సహా 59 యాప్స్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆర్మీలో పని చేస్తున్న సైనికులు జులై 15 రోజుల్లోగా పలు 89 యాప్స్‌లో ఉన్న తమ అకౌంట్స్‌ను తొలగించాలని ఆర్మీ ఆదేశించినట్టు ఇండియా టీవీ కథనాన్ని ప్రచురించింది. అలా చేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసినట్టు కథనంలో పేర్కొంది. అయితే ఆర్మీ సూచించిన యాప్స్ జాబితాలో చైనాకు చెందిన యాప్స్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, డైలీ హంట్, టిక్ టాక్, షేర్ ఇట్, ట్రూ కాల్, పబ్‌జి, టిండర్ వంటి యాప్స్ ఉన్నాయి. చైనా, పాకిస్థాన్ సైబర్ వార్‌కు దిగే అవకాశాలు ఉండటంతో.. ఆర్మీ ముందు జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

    First published:

    ఉత్తమ కథలు