Indian Army | ఇటు చైనా, అటు పాక్‌తో మన దేశం నిరంతరం ఏదో ఒక సమస్యతో సతమతం అవుతుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం తమ ఆయుధ వ్యవస్థకు పదునుపెట్టేందుకు కొత్త సాంకేతికితను అందిపుచ్చుకొంటున్నాయి. తాజాగా సింగిల్ షాట్ వెపన్ కోసం స్వీడిష్ డిఫెన్స్ కంపెనీ SAABతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
భారత్ (India) భౌతికంగా రెండు దేశాల నుంచి తీవ్రమైన ఘర్షణ వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. ఇటు చైనా(China), అటు పాక్‌తో నిరంతరం ఏదో ఒక సమస్యతో సతమతం అవుతుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం తమ ఆయుధ వ్యవస్థకు పదునుపెట్టేందుకు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొంటున్నాయి. తాజాగా సింగిల్ షాట్ వెపన్ కోసం స్వీడిష్ డిఫెన్స్ కంపెనీ SAABతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత సాయుధ బలగాలకు సింగిల్ షాట్ యాంటీ ఆర్మర్ వెపన్ ఏటీ4 (Single Shot Anti Armour Weapon AT4)ను సరఫరా చేసే కాంట్రాక్టు తమకు లభించిందని స్వీడిష్ డిఫెన్స్ కంపెనీ సాబ్ గురువారం తెలిపింది. తేలికైన మరియు పూర్తిగా పునర్వినియోగపరచలేని ఆయుధం కోసం కంపెనీకి కాంట్రాక్ట్ లభించిందని సాబ్ (SAAB) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
“AT4ని భారత సైన్యం మరియు భారత వైమానిక దళం ఉపయోగిస్తుంది” అని పేర్కొంది. ఒకే సైనికుడిచే నిర్వహించబడే సింగిల్-షాట్ సిస్టమ్ నిర్మాణాలు, ల్యాండింగ్ క్రాఫ్ట్, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు మరియు సిబ్బందికి వ్యతిరేకంగా సమర్థతను నిరూపించిందని, దాని 84 మిమీ క్యాలిబర్ వార్‌హెడ్ మెరుగైన శక్తిని మరియు పనితీరును అందిస్తుందని ప్రకటన తెలిపింది.
ప్రత్యేకతలు ఇవే..
భారత బలగాలు ఇప్పటికే SAAB యొక్క కార్ల్-గస్టాఫ్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నాయి. తాజా AT4 సిస్టమ్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. AT4CS AST ట్యాంకులు, హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్, నిర్మాణాలు, వ్యక్తులను టార్గెట్ చేయగలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా AT4 సిస్టమ్స్ ఎన్నో యుద్ధాల్లో మెరుగ్గా పని చేశాయి. చాలా తేలికైన, సింగిల్ షాట్‌తోపాటు డిస్పోజబుల్ సౌలభ్యం వీటి సొంతం. 20-300 మీ పరిధిలో AT4CS AST సామర్థ్యం ఉంటుంది.
8 కిలోల కంటే తక్కువ బరువు, 84 మిమీ క్యాలిబర్ వార్‌హెడ్ ఈ సిస్టమ్ సొంతం. AT4CS AST ప్రత్యేక సామర్థ్యాల్లో వార్ హెడ్ మోడ్ ఒకటి. ఈ మోడ్ నిర్మాణాలను నాశనం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు. యాక్సెస్ పాయింట్‌ను ఏర్పాటు చేసుకోవడంతోపాటు టార్గెట్‌ను సులభంగా చేధించ గలదు. మెరుగైన సామర్థ్యం, పనితీరు 84 mm క్యాలిబర్ వార్‌హెడ్ సొంతం భారత్‌కు పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో సైన్యానికి AT4 అదనపు బలం కానుందని సైన్యం భావిస్తోంది.
అమెరికా కూడా వినియోగిస్తోంది..
తాజా సిస్టమ్ భారత సైన్యం (Indian Army) సామర్థ్యానికి ఈ వ్యవస్థ ప్రత్యేక బలాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. భారత సైన్యం 1970ల నుంచి స్వీడిష్ మూలం కార్ల్-గుస్టాఫ్ ఆయుధ వ్యవస్థను ఉపయోగిస్తోంది. AT4CS RS యాంటీ ఆర్మర్ వెపన్ సిస్టమ్ వినియోగిస్తున్న దేశాలు ప్రస్తుతం భారత్, అమెరికా మాత్రమే కావడం గమనార్హం. ఆయుధం యొక్క కొత్త వెర్షన్లు 2014 లో మార్కెట్లోకి ప్రవేశపెట్టబడ్డాయి
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.