news18-telugu
Updated: September 17, 2019, 5:42 PM IST
సుఖోయ్ యుద్ధ విమానం నుంచి దూసుకెళ్తున్న అస్త్ర క్షిపణి
భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. ఎయిర్ టూ ఎయిర్ 'అస్త్ర' మిసైల్‌ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షిచింది. ఒడిశా తీరంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ అస్త్ర క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకొని ధ్వంసం చేసిందని భారత రక్షణశాఖ ప్రకటించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇదేనని వెల్లడించారు. అస్త్ర పరీక్ష విజయవంతం కావడంతో drdo శాస్త్రవేత్తలు, ఎయిర్ ఫోర్స్ అధికారులను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
అస్త్ర క్షిపణి ప్రత్యేకతలుపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఎయిర్ టు ఎయిర్ మిసైల్
15 కేజీల అత్యంత శక్తివంతమైన వార్ హెడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం
70 కి.మీ. దూరంలో లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఢీకొడుతుంది
గంటకు 5,555 వేగంతో వేగంతో అస్త్ర క్షిపణి దూసుకెళ్తుంది
అస్త్ర క్షిపణిని తీసుకెళ్లేలా Su-30 MKI విమానాలను అప్‌గ్రేడ్ చేశారు
Published by:
Shiva Kumar Addula
First published:
September 17, 2019, 5:42 PM IST