కుప్పకూలిన ఫైటర్ జెట్..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 2:44 PM IST
కుప్పకూలిన ఫైటర్ జెట్..!
  • News18
  • Last Updated: June 6, 2018, 2:44 PM IST
  • Share this:
న్యూఢిల్లీ/కచ్: గుజరాత్‌లో భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ మంగళవారం కుప్పకూలింది. జామ్‌నగర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్ చనిపోయాడు.

రోజువారీ శిక్షణా కార్యక్రమంలో భాగంగా గాల్లోకి ఎగిరిన వెంటనే విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. పైలెట్, ఎయిర్ కమాండర్ సంజయ్ చౌహాన్ చనిపోయినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి.




ప్రమాదంపై విచారణకు ఆదేశించాం. ఎలా జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. రొటీన్ ట్రైనింగ్ మిషన్‌లో భాగంగా గాల్లోకి ఎగిరింది. ఆ క్రమంలో బరేజా గ్రామ శివారులో ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కూలిపోయింది. అని అధికారులు తెలిపారు.

గ్రామ శివారులో విమాన శకలాలు చెల్లాచెదురుగా పని ఉన్నాయని స్థానికులు తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading