హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian Air Force: బేస్ క్యాంపుల నిఘా కోసం కొత్త డ్రోన్లు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం..!

Indian Air Force: బేస్ క్యాంపుల నిఘా కోసం కొత్త డ్రోన్లు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం..!

Photo Credit : ANI

Photo Credit : ANI

Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్‌‌లో జమ్మూ ఎయిర్ బేస్‌పై ద్రోన్ దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ స్థావరాలకు పటిష్ట భద్రత కల్పించనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air Force) కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్‌‌లో జమ్మూ ఎయిర్ బేస్‌పై ద్రోన్ దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ స్థావరాలకు పటిష్ట భద్రత కల్పించనుంది. ఈ మేరకు నిఘా కోసం 100 యూఏవీ డ్రోన్ సిస్టమ్స్‌ (Unmanned Aerial Systems- UAVs) కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్స్‌ను పూర్తిగా స్వదేశీ తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయనున్నారు. గత రెండేళ్ల నుంచి భద్రతా దళాలు నిఘా కోసం అత్యాధునిక సాంకేతికలతో కూడిన డ్రోన్స్ సేకరణపై దృష్టిసారించాయి. వీటిలో అతి ముఖ్యమైనది కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌. వీటిలో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్-సర్వైలెన్స్-రికనైసెన్స్ (ISR) మిషన్స్ కోసం వినియోగించనున్నారు.

* రూ.155 కోట్ల విలువైన ఆర్డర్

యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సరఫరా కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గతంలో హైదరాబాద్‌కు చెందిన జెన్ టెక్నాలజీస్‌కు రూ.155 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. దీంతో డ్రోన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి భారత వైమానిక దళం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

* భద్రతలో డొల్లతనం బహిర్గతం..

జమ్మూ ఎయిర్‌బేస్ డ్రోన్ దాడి భద్రతా లోపాలను బహిర్గతం చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేసింది. పేలుడు పదార్థాలతో కూడిన రెండు డ్రోన్లు ఎయిర్‌బేస్‌లోకి దూసుకెళ్లి ఓ భవనాన్ని ఢీకొన్నాయి. దీంతో ఈ భవనం పైకప్పు దెబ్బతింది. దీంతో యాంటీ డ్రోన్ సిస్టమ్‌పై రక్షణ శాఖ దృష్టి పెట్టింది.

* పగలు, రాత్రి గస్తీ

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ మినీ మానవ రహిత వైమానిక వ్యవస్థలు(డ్రోన్స్) బేస్ క్యాంప్‌ల నిఘా కోసం వినియోగించనున్నారు. ఇవి పగలుతో పాటు రాత్రి సమయాల్లో కూడా గస్తీ కాయనున్నాయి. ఎలక్ట్రో-ఆప్టిక్ (EO), థర్మల్ ఇమేజర్‌లను మోసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉంది. అలాగే ​​అధిక ఎత్తు నుంచి ఆపరేషన్స్ చేయడం, చాలా దూరం నుంచి మానవుల లక్ష్యాన్ని గుర్తించడం, శత్రు డ్రోన్, తీవ్రవాద దాడులను గుర్తించి, సమర్థవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం వీటికి ఉంటుంది.

* బీఈఎల్‌తో ఇండియన్ నేవీ ఒప్పందం..

పరిమిత నిఘా కోసం మైక్రో UAVలను సైన్యం కొనుగోలు చేస్తోంది. మరోపక్క హార్డ్-కిల్, సాఫ్ట్-కిల్ ఫీచర్లతో కూడిన స్వదేశీ సమగ్ర నావల్ యాంటీ-డ్రోన్ సిస్టమ్ (NADS)ని కొనుగోలు చేసేందుకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)తో ఇండియన్ నేవీ ఇటీవల ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

జమ్మూ ఎయిర్‌బేస్ డ్రోన్ దాడి తరువాత యూఏవీ(డ్రోన్స్)ల కోసం పెద్ద సంఖ్యలో భారతీయ సంస్థలకు ఆర్డర్స్ వచ్చాయి. వీటిలో స్వార్మ్ డ్రోన్స్, లాజిస్టిక్స్ డ్రోన్‌లతో పాటు పేలుడు పదార్థాలను మోసుకెళ్లి లక్ష్యాన్ని గుర్తించి బాంబులు పేల్చే డ్రోన్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ డ్రోన్‌లను ఆర్మీ మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.

Published by:Sridhar Reddy
First published:

Tags: Drones, Indian Air Force, National News

ఉత్తమ కథలు