20 Percent Increase in Rapes in 2021 : సాంకేతింగా దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా..మహిళలు(Women), ఆడపిల్లలకు మాత్రం సంరక్షణ కరువైంది. మహిళల సంరక్షణ కోసం చట్టాలు చేస్తున్నా అవి బురదలో పోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. మహిళపై అఘాయిత్యాలు(Crime Against Women) రోజు రోజుకూ పెరుగుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)తెలిపింది. 2020తో పోల్చితే 2021లో మహిళపై అత్యాచారాలు(Rape On Women) దాదాపు 20శాతం పెరిగాయి. తాజాగా NCRB విడుదల చేసిన "క్రైమ్ ఇన్ ఇండియా 2021" నివేదిక గణంకాలను పరిశీలిస్తే..2020లో దేశంలో 28,046 అత్యాచార కేసులు(Rape Cases)నమోదుకాగా,2021లో దేశంలో 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజుకు సగటున 86 అత్యాచారాలు చోటుచేసుకుంటున్నట్లు ఎన్సీఆర్బీ రిపోర్ట్ తెలిపింది.. మరోవైపు, మహిళలపై నేరాలకు సంబంధించిన దేశవ్యాప్తంగా ప్రతి గంటకు సగటున 49 కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది.2021లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 4,28,278 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 56,083 కేసు నమోదయ్యాయి. రాజస్తాన్ లో 40,738, మహారాష్ట్రలో 39,526, వెస్ట్ బెంగాల్లో 35,884, ఒడిశాలో 31,352 కేసులు నమోదయ్యాయని NCRB తెలిపింది. మహిళలపై నేరాల రేటు పరంగా 2021లో అసోం (168.3) రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (147), ఒడిశా (137), హర్యానా (119.7), తెలంగాణ (111.2) ఉన్నాయి. మహిళలపై జరిగిన నేరాలలో.. అత్యాచారం, అత్యాచారం చేసిన తర్వాత హ్య, వరకట్నం, యాసిడ్ దాడులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, కిడ్నాప్, బలవంతపు వివాహం, మానవ అక్రమ రవాణా, ఆన్ లైన్ వేధింపులు వంటి నేరాలున్నాయి.
Madrassa Demolished : బుల్డోజర్స్ తో మదర్సాని కూల్చివేసిన సర్కార్..టీచర్ అరెస్ట్
మరోవైపు, 2020తో పోలిస్తే 2021లో దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాలు 40 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 19 మెట్రో నగరాల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో 32.20 శాతం కేసులు ఢిల్లీలోనే నమోదవడం గమనార్హం. గతేడాది ఢిల్లీలో మహిళలపై 13,892 నేర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 3948 కిడ్నాప్ కేసులు, భర్తల చేతిలో చిత్రహింసలకు గురైన కేసులు 4674, మైనర్ బాలికలపై రేప్ కేసులు 833 ఉన్నాయి. సగటున ప్రతీరోజూ ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. కట్నం వేధింపులతో మృతి చెందిన కేసులు 136 నమోదయ్యాయి. ఇక మహిళల పరువుకు భంగం కలిగించేలా వారిపై దాడులకు పాల్పడిన కేసులు 2022 నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద 1357 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న 19 మెట్రో నగరాల్లో మహిళలపై నేరాలకు సంబంధించి 43,414 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ తర్వాత మహిళలపై అత్యధిక నేరాలు నమోదైన నగరాల్లో ముంబై, బెంగళూరు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ముంబైలో 12.76 శాతం, బెంగళూరులో 7.2 శాతం కేసులు నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.