• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIA WILL BECOME TOLL NAKA MUKT IN NEXT TWO YEARS SAYS MINISTER NITIN GADKARI SK GH

No Toll Gates: గుడ్ న్యూస్... మరో రెండేళ్లలో హైవేలపై టోల్ గేట్స్ కనిపించవు..

No Toll Gates: గుడ్ న్యూస్... మరో రెండేళ్లలో హైవేలపై టోల్ గేట్స్ కనిపించవు..

ప్రతీకాత్మక చిత్రం

అన్ని టోల్ వసూళ్లకు జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల వచ్చే ఐదేళ్లలో టోల్ ఆదాయం రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

  • Share this:
హైవేలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురయ్యే ముఖ్యమైన సమస్య టోల్ గేట్. దీని వల్ల కొంత సేపు అక్కడ ఆగాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులుపడతారు. ఐతే భవిష్యత్తులో ఆ సమస్య ఉండదు. అసలు టోల్‌గేట్సే కనిపించవు. ఎందుకంటే టోల్ వసూలు కేంద్రప్రభుత్వం జీపీఎస్ (Global Positioning System) టెక్నాలజీని ఖరారు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల టోల్ గేటు(Toll Gate) వద్ద ఆగాల్సిన పని లేకుండా సాఫీగా సాగిపోవచ్చని ఆయన తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్ టోల్ ఫ్రీ దేశంగా మారుతుందని తెలిపారు.

అసోచాం ఫౌండేషన్ వీక్‌లో మాట్లాడిన నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక పునరుజ్జీవనం కోసం నేషనల్ ఇన్ఫాస్ట్రక్చర్ పైప్ లైన్ అనే అంశంపై తన దృక్పథాన్ని పంచుకున్నారు. వాహనాల కదలిక ఆధారంగా టోల్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతా నుంచి తీసివేస్తామని వివరించారు. ఇప్పుడు అన్ని వాణిజ్య వాహనాలు వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థలతో వస్తున్నప్పటికీ పాత వాహనాల్లో జీపీఎస్‌ను వ్యవస్థాపించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని చెప్పారు నితిన్ గడ్కరీ.

"జీపీఎస్ ఆధారంగా వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించే నూతన వ్యవస్థ రానుంది. వచ్చే మార్చి నాటికి దేశంలోని టోల్ వసూళ్లు రూ.34 వేల కోట్లకు చేరుతాయని అంచనా. అన్ని టోల్ వసూళ్లకు జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల వచ్చే ఐదేళ్లలో టోల్ ఆదాయం రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుంది" అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

భారత్‌లో ఉపాధికల్పన, పేదరిక నిర్మూలనకు పారిశ్రామిక అభివృద్ధి ముఖ్యమని నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే ప్రస్తుతం పరిశ్రమలు కేవలం భారత్ లోని పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని, కాబట్టి వృద్ధి చెందుతున్న పట్టణీకరణలో పరిశ్రమల వికేంద్రీకరణ అత్యవసరమని స్పష్టం చేశారు. ఎందుకంటే పెరుగుతున్న పట్టణీకరణ నగరాల్లో తీవ్రమైన సమస్యను కలిగిస్తుందని, ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా తదితర సిటీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని తెలిపారు కేంద్రమంత్రి.

మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సాహించాల్సిన అవసరాన్ని నితిన్ గడ్కరీ వివరించారు. ఆర్థికంగా లాభదాయకం లేని ప్రాజెక్టుల్లో ప్రభుత్వ సహకారాన్ని ఆయన హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ-ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా గడ్కరీ వ్యక్తపరిచారు. ఆర్థికంగా లాభదాయకం లేని ప్రాజెక్టుల్లో ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Published by:Shiva Kumar Addula
First published: