హోమ్ /వార్తలు /జాతీయం /

భారత్ - పాకిస్థాన్ యుద్ధం జరిగితే... ఎవరి బలం ఎంత? పూర్తి వివరాలు

భారత్ - పాకిస్థాన్ యుద్ధం జరిగితే... ఎవరి బలం ఎంత? పూర్తి వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Pakistan War : 2018-19లో భారత రక్షణ బడ్జెట్ రూ.2.95 లక్షల కోట్లు పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ రూ.56 వేల కోట్లే. ఏ రకంగా చూసినా పాకిస్థాన్ మనతో తలపడలేదు.

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలున్నాయి. రెండు దేశాలూ తమ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకర్ల, యుద్ధ విమానాల్నీ సరిహద్దులకు తరలిస్తున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం జరిగేలా ఉంది. ఐతే, యుద్ధమే జరిగితే తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం తప్పదు. ఏ రకంగా చూసినా గెలిచేది భారతే. అయినప్పటికీ... పాకిస్థాన్ యుద్ధానికి సై అంటోంది. ఇదివరకట్లా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినా సహించే ప్రసక్తి లేదంటోంది. అందువల్ల యుద్ధం జరగొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. ఐతే... ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద మిలటరీ దేశం. పాకిస్థాన్ ఆరో స్థానంలో ఉంది. 2018-19లో భారత రక్షణ బడ్జెట్ రూ.2.95 లక్షల కోట్లు పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ రూ.56 వేల కోట్లే. ఏ రకంగా చూసినా పాకిస్థాన్ మనతో తలపడలేదు.

భారత్, పాకిస్థాన్ బలబలాల్ని పరిశీలిస్తే...


బలాబలాలుభారత్పాకిస్థాన్
త్రివిధ దళాలు42,07,2509,19,000
సైనికులు13,62,5006,37,000
రిజర్వ్ ఫోర్స్28,44,7502,82,000
విమానాలు2,102951
ఫైటర్ విమానాలు676301
అటాకింగ్ విమానాలు809394
రవాణా హెలీకాఫ్టర్లు857261
ట్రయినర్ విమానాలు323190
హెలీకాఫ్టర్లు666316
అటాకింగ్ హెలీకాఫ్టర్లు1652
ట్యాంకులు4,4262,924
ఆర్మ్‌డ్ ఫైటర్ ట్యాంకులు6,7042,828
సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ290465
టోన్డ్ ఆర్టిలరీ7,4143,278
రాకెట్ లాంచర్లు292134
నౌకాదళం295197
విమాన వాహక నౌకలు10
జలాంతర్గాములు158
డెస్ట్రాయర్స్110
న్యూక్లియర్ వార్‌హెడ్స్110140


 


హిమాలయాలు సహా, సరిహద్దు పర్వతాల్లో ఇండియాతో యుద్ధం చెయ్యాలంటే పాకిస్థాన్ వల్ల కాదని తెలుస్తోంది. భౌగోళికాంశాలు ఇండియాకే అనుకూలంగా ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఐతే... సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకుని అణుబాంబులు విసిరేంత యుద్ధం జరిగితే మాత్రం పాకిస్థాన్ కంటే భారతే ఎక్కువగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఐతే... పరిస్థితి అంతదాకా వెళ్లదంటున్నారు విశ్లేషకులు.


ఇవి కూడా చదవండి :


లోక్‌సభ ఎన్నికలకు జోరుగా ఏర్పాట్లు... నెలాఖరున షెడ్యూల్ రిలీజ్?


సిట్టింగ్ ఎంపీలపై అసంతృప్తితో నరేంద్ర మోదీ... ఈసారి సగం మంది ఎంపీలకు షాకేనా?


ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

First published:

Tags: National News, Pulwama Terror Attack

ఉత్తమ కథలు