హోమ్ /వార్తలు /జాతీయం /

రాఫెల్‌ ముందు ...పాకిస్థాన్ F-16 ఫైటర్ జెట్ ఓ బచ్చాలాంటిది

రాఫెల్‌ ముందు ...పాకిస్థాన్ F-16 ఫైటర్ జెట్ ఓ బచ్చాలాంటిది

రఫేల్ యుద్ధ విమానం

రఫేల్ యుద్ధ విమానం

ఇప్పటివరకు పాక్ ఫైటర్ జెట్స్‌ను ఎదుర్కోవాలంటే... భారత్ రెండు సుఖోయ్-30MKI విమానాలు అవసరం. ఎందుకంటే పాక్ ఫైటర్ జెట్‌లో ఉన్న ఆయుధాల ప్యాకేజీ సుఖోయ్ కంటే ఉత్తమమైనవి. అయితే ఇప్పుడా టెన్షన్ లేదు

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. నువ్వా నేనా అంటూ గగనతలంలో ఇరుదేశాల యుద్ధ విమానాలు దూసుకెళ్తున్నాయి. తాజాగా పాక్ జెట్ ఫైటర్స్ భారత్‌లోకి ప్రవేశించాయి. మూడు కిలోమీటర్ల మేర భారత్ గగనతలంలోకి పాకిస్థఆన్ ఫైటర్ జెట్స్ దూసుకురావడంతో వాటిని గట్టిగా బుద్ధి చెప్పాయి. పాక్ F-16 విమానాన్ని నేలమట్టం చేసింది భారత సైన్యం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ యుద్ధ విమానాల ప్రదర్శన హాట్ టాపిక్‌గా మారింది. అయితే భారత్ రాఫెల్ యుద్ధ విమానాల ముందు పాక్ F-16 తేలిపోనున్నాయి.


ఎందుకంటే ఇప్పటివరకు పాక్ ఫైటర్ జెట్స్‌ను ఎదుర్కోవాలంటే... భారత్ రెండు సుఖోయ్-30MKI విమానాలు అవసరం. ఎందుకంటే పాక్ ఫైటర్ జెట్‌లో ఉన్న ఆయుధాల ప్యాకేజీ సుఖోయ్ కంటే ఉత్తమమైనవి. అయితే రాఫెల్ రాకతో ఇప్పటివరకు ఉన్న ఈ కొరత తీరపోనుంది. ఇక పాక్ యుద్ధవిమానాలు ఎదుర్కోవడం రాఫెల్‌తో చాలా సులభం. రాఫెల్ జెట్స్‌ను ఎదుర్కొవాలంటే ఇక పాకిస్థాన్ రెండు F-16లను వినియోగించాల్సి వస్తుంది. దీంతో భారత్‌పై భారం తగ్గిపోతుంది. మరోవైపు అణు ఆయుధాల జాబితాలో కూడా రాఫెల్‌కు చోటు దక్కింది. దీంతో భారతీయ సైన్యం బలం రెట్టింపయ్యింది.


భారత్‌కు రాఫెల్ యుద్ధ విమనాల్ని సరఫరా చేస్తున్న ఫ్రాన్స్ ఈ విషయాన్ని ముందే చెప్పింది. రాఫెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన బెస్ట్ ఫైటర్ అని తెలిపింది. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫిప్త్ జనరేషన్ విమానాలతో సరిసమానమైన శక్తి సామార్ధ్యాల్ని కల్గి ఉంటాయని ఫ్రాన్స్ ఏవియేషన్ కంపెనీ తెలిపింది. అలాంటి రాఫెల్ ముందు పాక్ ఎఫ్-16 సామార్థ్యం చాలా తక్కువని తేల్చింది.

First published:

Tags: India, India VS Pakistan, Jammu and Kashmir, Pakistan, Pulwama Terror Attack

ఉత్తమ కథలు