హోమ్ /వార్తలు /జాతీయం /

India vs Pakistan: భారత్, పాకిస్థాన్‌లో విమాన సర్వీసులు రద్దు... ఏం జరుగుతోంది ?

India vs Pakistan: భారత్, పాకిస్థాన్‌లో విమాన సర్వీసులు రద్దు... ఏం జరుగుతోంది ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India vs Pakistan: పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియల్ కోట్ విమానాశ్రయాల్లో జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు కొద్ది గంటల ముందే భారత్ కూడా పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పలు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులను నిలిపేసింది. పంజాబ్‌లోని అమృత్ సర్, జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ లేహ్ ఎయిర్ పోర్ట్‌లను మూసేంది.

ఇంకా చదవండి ...

    భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత్ చర్యలకు కచ్చితంగా ప్రతిచర్యలు ఉంటాయని ప్రకటించిన పాకిస్థాన్... బుధవారం ఉదయం భారత్ భూభాగంలో యుద్ధ విమానాల ద్వారా దాడులు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాన్ని భారత దళాలు కూల్చేశాయి. ఇక ఇరుదేశాలు పలు విమానాశ్రయాల్లో సర్వీసులను రద్దు చేయడంతో... ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.


    ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు ఎయిర్ పోర్టుల్లో విమాన సర్వీసుల్ని పూర్తిగా నిలిపివేశారు. పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియల్ కోట్ విమానాశ్రయాల్లో జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు కొద్ది గంటల ముందే భారత్ కూడా పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పలు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులను నిలిపేసింది. పంజాబ్‌లోని అమృత్ సర్, జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ లేహ్ ఎయిర్ పోర్ట్‌లను మూసేంది. పరిస్థితిని బట్టి మరిన్ని విమానాశ్రయాల్లో సర్వీసులను రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పాకిస్థాన్, భారత్ సరిహద్దు గగనతలం నుంచి ప్రయాణించే అనేక అంతర్జాతీయ విమానాలు సైతం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.


    First published:

    Tags: India, Jammu and Kashmir, Pakistan, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు