Home /News /national /

INDIA VS CHINA INDIA FOILS CHINESE INCURSION IN ARUNACHAL PRADESH BRIEFLY DETAINS PLA TROOPS GH SK

Exclusive: అరుణాచల్‌ వైపు దూసుకొచ్చిన చైనా దళాలు.. పట్టుకొని నిర్బంధించిన భారత సైన్యం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Vs China: ఎల్‌ఏసీ వద్ద భారతదేశం వైపు చైనా పెట్రోలింగ్ బలగాల అతిక్రమణను భారత దళాలు తీవ్రంగా నిరోధించాయని, ఈ క్రమంలో కొంతమంది చైనా సైనికులను తాత్కాలికంగా నిర్బంధించాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

భారత్, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లద్దాఖ్‌లో ఘర్షణను మరవకముందే.. ఇప్పుడు అరుణాచల్‌లోనూ ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు  తెలుస్తోంది. టిబెట్ వైపు నుంచి దాదాపు 200 మంది చైనా సైనికులు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ ఖాళీగా ఉన్న బంకర్లను తొలగించే ప్రయత్నం చేస్తుండగా, వారిని భారత సైనికులు తాత్కాలికంగా నిర్భందించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గత వారం వాస్తవ నియంత్రణ రేఖకు (LAC) దగ్గర బమ్ లా- యాంగ్సే సరిహద్దు ప్రాంతంలో జరిగిందని అధికార వర్గాలు న్యూస్‌18కి తెలిపాయి. LAC వద్ద భారతదేశం వైపు చైనా పెట్రోలింగ్ బలగాల అతిక్రమణను భారత దళాలు తీవ్రంగా నిరోధించాయని, ఈ క్రమంలో కొంతమంది చైనా సైనికులను తాత్కాలికంగా నిర్బంధించాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

‘ఈ ఘటన తరువాత స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. అనంతరం సమస్య పరిష్కారమైంది. ఆ తరువాత చైనా సైనికులను విడుదల చేశారు. ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి’ అని ప్రభుత్వ వర్గాలు న్యూస్18కి తెలిపాయి. ఈ ఘటనపై ఆర్మీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే ఈ క్రమంలో భారత బలగాలకు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణ శాఖ వర్గాలు న్యూస్ 18కి చెప్పాయి.

Ladakh Earthquake: అర్థరాత్రి అలజడి.. లద్దాఖ్‌ను వణికించిన భూకంపం

"ఇండియా- చైనా సరిహద్దును అధికారికంగా గుర్తించలేదు. అందువల్ల LAC విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. దీంతో ఇరువర్గాలు తమ అవగాహన మేరకు పెట్రోలింగ్ కార్యకలాపాలను చేపడుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు, ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉంటేనే ఇలాంటి ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత నెలకొల్పడం సాధ్యమవుతుంది” అని ఒక అధికారి తెలిపారు.

"ఇలా పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రెండు దేశాల బలగాలు నేరుగా ఎదురుపడినప్పుడు.. ఇరువైపులా అంగీకరించిన ప్రోటోకాల్‌లు, యంత్రాంగాల నిర్ణయాల ప్రకారం ఏకాభిప్రాయానికి వస్తారు. ఇలాంటి సందర్భాల్లో పరస్పర అవగాహనకు రావడానికి ముందు కొన్ని గంటల పాటు ఘర్షణ కొనసాగడం సాధారణ విషయం” అని సంబంధిత అధికారి వెల్లడించారు.

Snake Bite: పాములతో కరిపించడం కొత్త ట్రెండ్ అయిపోయింది.. బెయిల్ ఇచ్చేదే లేదు

* వారికి ఇది కొత్త కాదు
ఈ ప్రాంతంలో చైనా దురాక్రమణలు కొత్త విషయం కాదు. 2016లో LAC వద్ద యాంగ్‌సే ప్రాంతంలో 200 మందికి పైగా చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చారు. కానీ కొన్ని గంటల్లో తిరిగి వెళ్లిపోయారు. 2011లో చైనా సైనికులు LAC పరిధిలోని భారత భూభాగంలో 250 మీటర్ల పొడవైన గోడను ధ్వంసం చేశారు. ఈ విషయంపై అప్పట్లో భారత వర్గాలు చైనాకు నిరసన తెలిపాయి. గత నెలలో LACకి సమీపంలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని బారాహోటి సెక్టార్‌లో చైనా దళాలు దూకుడుగా పెట్రోలింగ్ నిర్వహించాయని వార్తలు వచ్చాయి. ఈ సెక్టార్‌లో చైనీయులు కొన్ని గంటల పాటు గడిపిన తరువాత వెనక్కు వెళ్లినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే తాజా ఉల్లంఘన జరిగింది.

గత ఏడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్‌లోని LAC వద్ద భారత్- చైనా ఘర్షణలు కొనసాగిస్తున్నాయి. ఇరు దేశాల సైనిక, దౌత్యపరమైన చర్చల తరువాత సున్నితమైన పాంగాంగ్ త్సో ప్రాంతం, గోగ్రా ప్రాంతాల్లో రెండు దేశాల సైనిక దళాలు వెనక్కు వెళ్లినప్పటికీ, ఇంకా ఘర్షణ వాతావరణం సద్దుమణగలేదు. LAC వెంట రెండు దేశాలు వేలాది అదనపు దళాలను కొనసాగిస్తున్నాయి.

Lakhimpur హింసాకాండ: నిందితుల్ని అరెస్టు చేశారా?24 గంటల్లో చెప్పండి

భారత్, చైనా మధ్య తూర్పు లద్దాఖ్‌లో త్వరలో 13వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇందులో హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దళాలను పూర్తిగా వెనక్కు మళ్లించడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. తూర్పు లద్దాఖ్‌లో ఇలాంటి అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. తాజాగా చైనీయులు ఈస్ట్రర్న్, సెంట్రల్ సెక్టాలర్‌లకు చొరబాటు ధోరణిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

* తవాంగ్ ప్రాంతానికి ఎందకు అంత ప్రాధాన్యం ఉంది?
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతం.. భారతదేశం, చైనా మధ్య ఘర్షణలకు కేంద్రంగా నిలుస్తోంది. 1962 యుద్ధంలో చైనా తవాంగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఇది టిబెట్‌లో ఒక భాగమని ప్రకటించిన చైనా, అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా ప్రకటించింది. తవాంగ్‌కు చారిత్రక ప్రాముఖ్యత సైతం ఉంది. ఇది ఆరో దలైలామా జన్మస్థలం. లాసా తర్వాత టిబెటన్ బౌద్ధమతంలో ఒక ముఖ్యమైన స్థానం ఈ ప్రాంతానికి ఉంది. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైనది. తవాంగ్ నుంచి బ్రహ్మపుత్ర మైదానాల వరకు సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి అస్సాంలోని తేజ్‌పూర్‌ వరకు షార్ట్‌కట్‌లో చేరుకోవచ్చు.

Srinagar: స్కూళ్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. శ్రీనగర్‌‌లో ఇద్దరు టీచర్లు మృతి

తవాంగ్ నుంచి గౌహతి, సిలిగురి కారిడార్ వరకు సులభంగా చేరుకోవచ్చని ఒక సీనియర్ రక్షణ అధికారి న్యూస్18కు చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతం సైన్యానికి వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తోందన్నారు. అక్కడ ఉన్న బొమ్డిల్లా (Bomdilla), నేచిపు (Nechiphu), సె లా (Se La) వంటి మూడు ప్రధాన పాస్‌లు భారత రక్షణ కార్యకలాపాలను విస్తరించడంలో సహాయపడతాయని వివరించారు. సె లా పాస్.. తవాంగ్‌ను మిగిలిన అరుణాచల్ ప్రదేశ్‌తో కలుపుతుంది.

ప్రస్తుతం భారత దళాలు LAC పరిధిలో ఎదురవ్వనున్న కఠినమైన శీతాకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నాయి. LAC వద్ద చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. భారత్ కూడా ఎల్‌ఏసీ వద్ద అదనంగా 50,000- 60,000 మంది సైనికులను మోహరించడానికి ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. తూర్పు లద్దాఖ్‌ ఘర్షణ తరువాత ఈ అంశంపై భారత్‌ దృష్టి పెట్టింది. అందువల్ల గతంతో పోలిస్తే ఇక్కడ విధులు నిర్వర్తించే సైనికులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Arunachal Pradesh, China, India, Indo China Tension

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు