పాకిస్తాన్ విషయంలో భారత్ కీలక నిర్ణయం.. ఖాళీ చేసి వెళ్లాల్సిందే..

ప్రస్తుతం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో 110 మంది పనిచేస్తున్నారు. వారిలో 55 మందిని తిరిగి పాకిస్తాన్ పంపిచాలని.. మిగిలిన వారు మాత్రమే ఇక్కడ ఉండాలని తెలిపింది. వారం రోజుల్లో దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: June 23, 2020, 8:32 PM IST
పాకిస్తాన్ విషయంలో భారత్ కీలక నిర్ణయం.. ఖాళీ చేసి వెళ్లాల్సిందే..
ప్రస్తుతం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో 110 మంది పనిచేస్తున్నారు. వారిలో 55 మందిని తిరిగి పాకిస్తాన్ పంపిచాలని.. మిగిలిన వారు మాత్రమే ఇక్కడ ఉండాలని తెలిపింది. వారం రోజుల్లో దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది.
  • Share this:
పాకిస్తాన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న పాకిస్తాన్ ఉద్యోగులు, సిబ్బందిని 50శాతం తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ చార్జ్ డిఎఫైర్స్‌కు నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో 110 మంది పనిచేస్తున్నారు. వారిలో 55 మందిని తిరిగి పాకిస్తాన్ పంపిచాలని.. మిగిలిన వారు మాత్రమే ఇక్కడ ఉండాలని తెలిపింది. వారం రోజుల్లో దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. అదే క్రమంలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే భారత ఉద్యోగులను 50శాతం తగ్గించుకుంటామని వెల్లడించింది.

పాకిస్తాన్ చార్జ్ డిఎఫైర్స్‌‌కు నోటీసులు పంపించాం. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ సిబ్బంది గూడఛర్యానికి పాల్పడుతున్నారు. అంతేకాదు ఉగ్రవాదులతో సంప్రదింపులు చేస్తున్నారు. మే 31న ఇద్దరు పాకిస్తాన్ ఉద్యోగులు గూఢచర్యం చేస్తూ పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత విదేశాంగ శాఖ


అంతేకాదు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న భారత ఉద్యోగులను కూడా అక్కడి అధికారులు, పోలీసులు వేధిస్తున్నారని విదేశాంగశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై ఓ వ్యక్తిని ఢీకొట్టి పారిపోతుండగా పట్టుకున్నామని అబద్ధాలు చెప్పింది. ఐతే గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డామని ఒప్పుకోవాలని.. వారిపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరువైపులా ఉద్యోగులను తగ్గించాలని భారత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
First published: June 23, 2020, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading