చైనాకు చెక్.. జూలైలో భారత్‌ చేతికి రఫేల్ యుద్ధ విమానాలు

జూన్ 2న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లేతో ఫోన్‌లో మాట్లాడారు. రఫేల్ యుద్ధ విమానాల సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఐతే భారత్‌కు సకాలంలోనే యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్‌నాథ్‌కు పార్లే హామీ ఇచ్చినట్లు సమాచారం

news18-telugu
Updated: June 30, 2020, 9:54 PM IST
చైనాకు చెక్.. జూలైలో భారత్‌ చేతికి రఫేల్ యుద్ధ విమానాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్ అమ్ముల పొదిలోకి శక్తివంతమైన, అధునాతన అస్త్రాలు చేరబోతున్నాయి. ఫ్రాన్స్‌ నుంచి భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు అతి త్వరలోనే వాయుసేనకు అందనున్నాయి. తొలిదశలో భాగంగా 6 రఫేల్ యుద్ధ విమానాలు జూలై నెలాఖరు వరకు భారత్ చేరుకోనున్నాయి. భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు రావడంతో.. భారత సైన్యం నైతిక స్థైర్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రఫేల్ యుద్ధ విమానాలతో సరిహద్దుల్లో గస్తీని మరింతగా పెంచవచ్చని అభిప్రాయడుతున్నారు.

2016 సెప్టెంబరులో ఇండియా, ఫ్రాన్స్ మధ్య రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం కుదిరింది. రక్షణ అవసరాల కోసం ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేస్తున్నారు. వీటి కోసం భారత ప్రభుత్వం రూ.58వేల కోట్లు ఖర్చు చేస్తోంది. భారత్‌కు అందే రఫేల్‌ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్ వినియోగిస్తున్న విమానాల కన్నా ఆధునికమైనవి. భారత పరిస్థితులకు తగ్గట్లుగా మరింత ఖర్చుతో అదనపు ఫీచర్లను కూడా జోడిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సత్తా ఈ రఫేల్ విమానాలకు ఉంది. ఇవి వాయుసేనలతో చేరితో మన రక్షణవ్యవస్థ మరింత పటిష్టమవుతుంది.

మరోవైపు కోవిడ్‌ నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల సరఫరా సమయానికి అందుతాయా? లేదా? ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలోనే జూన్ 2న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లేతో ఫోన్‌లో మాట్లాడారు. రఫేల్ యుద్ధ విమానాల సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఐతే భారత్‌కు సకాలంలోనే యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్‌నాథ్‌కు పార్లే హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తొలి దశ కింద ఆరు యుద్ధ విమానాలు జూలై నెలాఖరు వరకు భారత్‌కు చేరనున్నాయి. మనదేశానికి అత్యంత వ్యూహాత్మక వాయుసేన స్థావరమైన అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రఫేల్‌ యుద్ధవిమానాలు ఉంటాయని తెలుస్తోంది.


First published: June 30, 2020, 9:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading