Home /News /national /

INDIA TO HAVE 50 STATES AFTER 2024 POLLS SAYS KARNATAKA MINISTER

50 States In India : ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు..బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు!

మంత్రి ఉమేష్ కత్తి(ఫైల్ ఫొటో)

మంత్రి ఉమేష్ కత్తి(ఫైల్ ఫొటో)

India to have 50 states : త్వరలో దేశభవిష్య‌త్తు మార‌బోతుందా?అమెరికాలోలాగే భారత్ లో కూడా 50 రాష్ట్రాల ఏర్పాట్లకు ప్రణాళికలు జరుగుతున్నాయా? ప్రధాని మోదీ (PM Modi) ఈ విషయమై అధికారులతో సమాలోచనలు చేస్తున్నారా?ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం ఇస్తున్నారు అధికార బీజేపీ(BJP)కే చెందిన కీలక నేత.

ఇంకా చదవండి ...
India to have 50 states : త్వరలో దేశభవిష్య‌త్తు మార‌బోతుందా?అమెరికాలోలాగే భారత్ లో కూడా 50 రాష్ట్రాల(50 States in india) ఏర్పాట్లకు ప్రణాళికలు జరుగుతున్నాయా? ప్రధాని మోదీ (PM Modi) ఈ విషయమై అధికారులతో సమాలోచనలు చేస్తున్నారా?ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం ఇస్తున్నారు అధికార బీజేపీ(BJP)కే చెందిన కీలక నేత, కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి(Umesh Katti). 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశభవిష్య‌త్తు మార‌బోతోంద‌ని ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని బెల్గావిలో జరిగిన బార్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉమేష్ కత్తి మాట్లాడుతూ... 2024 సార్వత్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు స‌న్నాహ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని,అందుకు సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు త‌న‌కు స‌మాచారం అందింద‌న్నారు. దేశంలో మరింత మెరుగైన పాలన అందించేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి వివ‌రించారు. ఇదేమీ పార్టీ స్టాండ్ కాదు.. కానీ ఇది కచ్చితంగా జరగాల్సిందేనన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారు... అప్పుడు ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలుగా,మహారాష్ట్ర రెండుగా కర్ణాటక కూడా రెండుగా విభజించబడుతుందన్నారు. కర్ణాటకలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాల్సిందేనన్నారు.

ఉత్తర కర్ణాటక కూడా రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు మంత్రి ఉమేష్ కత్తి. రాష్ట్రం విడిపోయినా ఎటువంటి ప్రమాదం లేదని.. తామంతా కన్నడిగులుగానే ఉంటామన్నారు. జనాభా పెరుగుదల రీత్యా దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన సరైనదేనన్న ఉమేష్ కత్తి... జనాభా పెరుగుదల కారణంగా ఇప్పటికే బెంగళూరుపై ఒత్తిడి పెరిగిందన్నారు. ట్రాఫిక్ సహా అక్కడ అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కాబట్టి కర్ణాటకను రెండు రాష్ట్రాలుగా విభజించాల్సిన అవసరం ఉందని.. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం అంతా ఉద్యమించాలని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఎటువంటి సందేహం లేదని,తప్పకుండా అది జరిగి తీరుతుందన్నారు. బెల్గావి కేంద్రంగా కొత్త రాష్ట్రం ఏర్పడుతుందన్నారు.
అయితే ప్రధాని కర్ణాటకలో పర్యటించిన కొద్ది రోజులకే అధికార పార్టీ సీనియర్‌ నేత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. కాగా, కర్ణాటకలో ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలో విదర్భ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ చాలా కాలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అక్కడ ఉద్యమాలు కూడా జరిగాయి. తాజాగా ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలతో ప్రత్యేక రాష్ట్రాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కత్తి వ్యాఖ్యలు కాకతాళీయమా... లేక నిజంగానే కేంద్రం 50 రాష్ట్రాల ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తుందా అన్న చర్చ మొదలైంది.

Monkeypox : చచ్చాం రా బాబు..కరోనాలానే మంకీపాక్స్ కూడా మహమ్మారేనంట

Viral Video : అర్థరాత్రి నడిరోడ్డులో అమ్మాయిల డ్యాన్స్..ఇరగదీశారు చూడండి

అయితే మంత్రి ఉమేశ్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కొట్టి పారేశారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేసే ప్రతిపాదనేదీ ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మాట్లాడడం ఆ మంత్రికి కొత్త కాదని, ఎన్నో ఏళ్లుగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారన్నారు. ఆయన ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పుకోవాలని సీఎం అన్నారు.మరోవైపు దీనిపై మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పందించారు. కర్ణాటకను విడగొట్టేందుకు ప్రధాని స్థాయిలో చర్చలు జరుగుతున్నాయనే విషయం రాష్ట్ర మంత్రి ద్వారా బయటపడిందని.. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అని సిద్దరామయ్య ట్వీట్ లో తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: India, India states, Karnataka, Modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు