Home /News /national /

INDIA TO GET HOME GROWN AUTOMOBILE SAFETY RATING IN BHARAT NCAP SYSTEM UMG GH

Bharat NCAP: స్వదేశీ ఆటోమొబైల్ సేఫ్టీ రేటింగ్‌పై ఇండియా ఫోకస్.. వచ్చే ఏడాదే ముహూర్తం..!

స్వదేశీ ఆటోమొబైల్ సేఫ్టీ రేటింగ్‌పై ఇండియా ఫోకస్

స్వదేశీ ఆటోమొబైల్ సేఫ్టీ రేటింగ్‌పై ఇండియా ఫోకస్

స్వదేశీ ఆటోమొబైల్ సేఫ్టీ రేటింగ్‌పై భారత్ దృష్టిపెట్టింది. రహదారి భద్రతను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా తొలి వెహికల్ సేఫ్టీ రేటింగ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) పేరుతో ఒక వ్యవస్థను ఏర్పా?

ఇంకా చదవండి ...
ప్రపంచంలోకెల్లా విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. అయితే మన దేశంలో రోడ్ సేఫ్టీపై అధికార యంత్రాంగం సరిగా దృష్టి పెట్టలేకపోతోంది. రోడ్లపైకి వచ్చే వాహనాలకు విదేశీ సంస్థలే ప్రామాణిక రేటింగ్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వదేశీ ఆటోమొబైల్ సేఫ్టీ రేటింగ్‌పై భారత్ దృష్టిపెట్టింది. రహదారి భద్రతను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా తొలి వెహికల్ సేఫ్టీ రేటింగ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కొత్త వాహనాల భద్రతను తనిఖీ చేయడానికి గ్లోబల్ NCAP, యూరోపియన్ NCAP కార్ సేఫ్టీ ప్రోగ్రామ్‌ల తరహాలోనే క్రాష్ టెస్ట్‌లు నిర్వహించనుంది. వాటి పనితీరు ఆధారంగా స్టార్ రేటింగ్స్‌ను కేటాయించనుంది. భారత్ NCAP ప్రోగ్రామ్ 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. భారత్ NCAP ప్రవేశపెట్టే ముసాయిదా నోటిఫికేషన్‌కు తమ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని ట్విట్టర్ పోస్ట్‌లో కేంద్ర మంత్రి తెలిపారు. సురక్షితమైన వాహనాలను తయారు చేసేందుకు, భారతదేశంలోని వాహన తయారీ సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తూ, కస్టమర్లకు సురక్షితమైన కార్లను ఎంచుకునే వీలు కల్పించేందుకు కస్టమర్ సెంట్రిక్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేయడం దీని లక్ష్యమని గడ్కరీ చెప్పారు. భారత్ NCAPపై కొత్త నిబంధనలను రెండు నెలల్లోగా వెల్లడించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ఆటో మొబైల్ ఇండస్ట్రీ వీటిని ఈ విధానాన్ని స్వీకరించనుంది.



కార్ల బిల్డ్ క్వాలిటీ, ప్యాసింజర్ సేఫ్టీని నిర్ధారించడానికి క్రాష్ టెస్ట్‌ల ఆధారంగా మేడ్-ఇన్-ఇండియా కార్ల స్టార్ రేటింగ్ అవసరం. దీంతోపాటు మేడ్ ఇన్ ఇండియా కార్ల ఎగుమతి అవకాశాలను పెంచడానికి కూడా ఈ విధానం కీలకం. ఇండియన్ రోడ్లపై ప్రతి సంవత్సరం 1,50,000 ప్రమాదాలు జరుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల GDPకి 3.1% నష్టం వాటిల్లుతోంది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భారత్ NCAP సిస్టమ్‌ను రూపొందిస్తోంది. ఈ టెస్టింగ్ ప్రోటోకాల్ గ్లోబల్ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా ఉంటుందని, ప్రస్తుత భారతీయ నిబంధనలు కూడా మిలితమవుతాయని అధికారులు చెబుతున్నారు. భారత్ NCAP అమల్లోకి వస్తే, భారత వాహన తయారీదారులు తమ వెహికల్స్‌ను దేశీయంగా టెస్ట్ చేసుకునే అవకాశం కూడా లభించనుంది.

ప్రస్తుతం వాహనాల క్రాష్ టెస్టింగ్ తప్పనిసరి కాదు. కానీ కొన్ని కంపెనీలు తమ వాహనాల్లో కొన్నింటిని యూరప్‌లోని గ్లోబల్ NCAP గుర్తింపు పొందిన కేంద్రాలలో టెస్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా జర్మనీలో ఈ టెస్టింగ్ ప్రక్రియ ఎక్కువగా జరుగుతోంది. ఇండియన్ NCAP అమల్లోకి వస్తే, మన దేశంలో కూడా ఇలాంటి టెస్ట్‌లు చాలా తక్కువ ఖర్చుతో చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: CAR, India, Vehicles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు