చైనా కంపెనీలకు భారత్ మరో షాక్..అవి కూడా నిషేధం

హైవే ప్రాజెక్టుల్లో ఇకపై చైనా కంపెనీలను అనుమతించబోమని రోడ్డు రవాణా, హైవేలు, ఎంఎస్ఎంఈ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా త్వరలోనే ఓ విధానాన్ని తీసుకువస్తామని ఆయన చెప్పారు.

news18-telugu
Updated: July 1, 2020, 5:47 PM IST
చైనా కంపెనీలకు భారత్ మరో షాక్..అవి కూడా నిషేధం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాకు మరో బిగ్ షాక్ తగలబోతోంది. ఇప్పటికే 59 చైనీష్ మొబైల్ అప్లికేషన్‌లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది. హైవే ప్రాజెక్టుల్లో ఇకపై చైనా కంపెనీలను అనుమతించబోమని రోడ్డు రవాణా, హైవేలు, ఎంఎస్ఎంఈ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా త్వరలోనే ఓ విధానాన్ని తీసుకువస్తామని ఆయన చెప్పారు.

మరోవైపు హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు భారత కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా నిబంధనలను సైతం సడలిస్తామని చెప్పారు నితిన్ గడ్కరీ. అంతేకాదు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోనూ చైనా పెట్టుబడులను ప్రోత్సహించబోమని వెల్లడించారు. ప్రస్తుతం NHAI ఆధ్వర్యంలో దేశంలో కొనసాగుతున్న కొన్ని ప్రాజెక్టుల్లో చైనా సంస్థలు పనిచేస్తున్నాయని మీడియా అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఈ సమాధానం ఇచ్చారు.

గల్వాన్ లోయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చైనా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. చైనా వస్తువులు, కంపెనీలను నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే డ్రాగన్‌తో తెగదెంపులు చేసుకుంటోంది భారత్. చైనా‌కు చెక్ పెట్టేందుకు వాటి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించి ఊహించని షాక్ ఇచ్చింది భారత్. అంతేకాదు చైనా కంపెనీలతో చేసుకున్న పలుతాయి ఒప్పందాలను రైల్వేశాఖ కూడా రద్దుచేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో 5జీ సేవలను కూడా నిలివేయనున్నారు. ఈ క్రమంలో హైవే ప్రాజెక్టుల్లోనూ చైనా సంస్థలను నిషేధిస్తామని నితిన్ గడ్కరీ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
First published: July 1, 2020, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading