హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భారత్ కు తీపికబురు చెప్పిన ఏవియేషన్ సంస్థ.. 80 విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్.. ఏపీకి ఎన్నంట

భారత్ కు తీపికబురు చెప్పిన ఏవియేషన్ సంస్థ.. 80 విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్.. ఏపీకి ఎన్నంట

విమానం

విమానం

Delhi: పౌరవిమానయాన సంస్థ కు భారత్ కు తీపి కబురుచెప్పింది. తొందరలోనే 80 వరకు విమానాశ్రయాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

మన దేశంలో ఇప్పటికి అనేక చోట్ల సరైన విమానాశ్రయాలు అందుబాటులో లేవు. దీంతో కొన్ని చోట్ల డెవలప్ మెంట్ ఆశించిన స్థాయిలో జరగట్లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇదిలా ఉండగా.. వచ్చే నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో భారతదేశం దాదాపు 80 విమానాశ్రయాలను చేర్చే అవకాశం ఉందని ఏవియేషన్ రెగ్యులేటర్ అథారిటీ మీడియా సమావేశంలో తెలిపింది. ఈ క్రమంలో.. గత ఎనిమిదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 141కి పెరిగిందని సంస్థ తెలిపింది. అదే విధంగా.. రానున్న నాలుగైదు సంవత్సరాల్లో ఇది 220కి పెరుగుతుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

గోవాలోని మోపాతో సహా దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని నవీ ముంబై, షిర్డీ, సింధుదుర్గ్, కర్ణాటకలోని కలబురగి, విజయపుర, హాసన్, శివమొగ్గ; మధ్యప్రదేశ్‌లోని దబ్రా; ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్, నోయిడా (జేవార్); గుజరాత్‌లోని ధోలేరా, హిరాసర్ (రాజ్‌కోట్); పుదుచ్చేరిలోని కారైకల్; ఆంధ్రప్రదేశ్‌లోని దగదర్తి (నెల్లూరు), భోగాపురం, ఓర్వకల్ (కర్నూలు); పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్; సిక్కింలో పాక్యోంగ్; కేరళలోని కన్నూర్; అరుణాచల్ ప్రదేశ్‌లోని హోలోంగి (ఇటానగర్).

ఇప్పటివరకు, ఎనిమిది గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు - దుర్గాపూర్, షిర్డీ, సింధుదుర్గ్, పాక్యోంగ్, కన్నూర్, కలబురగి, ఓర్వకల్, ఖుషినగర్ - కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మండిలోని నాగ్‌చల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇవ్వబడింది. భారతదేశం యొక్క UDAN ప్రాంతీయ విమానయాన పథకం కింద FY 2022-23లో మరో 35 విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌లు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా బీహర్ లోని (Bihar) సరన్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలాన్ గ్రామానికి చెందిన బాలక్ రామ్ కుమారుడు ప్రభురామ్. ఇతను కల్లుగీత కార్మికుడు . వీరికి వినోద్ రామ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇతను ఆటోను నడిపిస్తు ఉంటాడు. అయితే.. ప్రభురామ్.. రాత్రి పది తర్వాత తన ఇంటికి వెళ్లాడు. అప్పుడు తనకు ఆకలిగా ఉందని అన్నంపెట్టమని భార్యను అడిగాడు. ఆ తర్వాత.. భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది.

అయితే.. కూరలో ఉప్పులో సరిగ్గా వేయలేదని భార్యతో గొడవపడ్డాడు. కోపంలో కంట్రోల్ తప్పి భార్యను అక్కడే ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, నిందితుడి కొడుకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడి భార్యను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో(Social media) వైరల్ గా (Viral news) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Andhra Pradesh, Aviation, Delhi, Flight, VIRAL NEWS