ఏప్రిల్ 11న స్థానికంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్(ATGM) హెలీనాను(Helina) ఇండియా(India) విజయవంతంగా పరీక్షించింది. అధిక ఎత్తు నుంచి అధునాతన తేలికపాటి హెలికాప్టర్(Heli crafter)నుంచి ప్రయోగించగా ఇది తన లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్‌లో(Pokhran) నిర్వహించిన ట్రయల్స్‌కు(Trials) కొనసాగింపుగా ఎత్తైన ప్రదేశాలలో సమర్థతను పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ALHలో మిసైల్‌ను(Missile) ప్రవేశపెట్టే ముందు జరిగిన ట్రయల్స్‌ను సీనియర్ ఆర్మీ కమాండర్లు(Army Commanders), DRDO సీనియర్ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. ఫ్లైట్ టెస్ట్‌ను భారత సైన్యం, భారత వైమానిక దళం, DRDO బృందం సంయుక్తంగా నిర్వహించారు. ఏప్రిల్ 12న మరింత ఎత్తు నుంచి హెలీనాను పరీక్షించినట్లు DRDO తెలిపింది.
Lemons stolen: నిమ్మకాయలను చోరీ చేసిన బత్తాయిలు.. కారణం ఏంటో తెలుసా?
హెలీనా ఫీచర్స్ విషయానికి వస్తే.. దీని పరిధి 7కిలోమీటర్లు ఉంటుంది. హెలీనాలో ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ సిస్టమ్ ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది. ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్.. డైరెక్ట్ హిట్ మోడ్ అండ్ టాప్ అటాక్ మోడ్‌లలో ప్రయోగించే అవకాశం ఉంటుంది. నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఆధారంగా దీనిని తయారు చేశారు. ప్రపంచంలోని అత్యంత అధునాతన యాంటి- ట్యాంక్ గైడెడ్ మిసైల్‌గా దీనిని డీఆర్డీఓ పేర్కొంటుంది.
పగలు, రాత్రిళ్లు అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం దీని సొంతం. కన్వెన్షనల్, ఎక్స్‌ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్‌తో శత్రు ట్యాంకులను పడగొట్టగలిగే శక్తి దీనికి ఉంది. ఒక్క మిసైల్ అంచనా వ్యయం రూ.కోటి లోపే ఉంటుందని నివేదికలు తెలుపుతున్నాయి. హెలీనా భారత సైన్యంలోకి ప్రవేశించినప్పుడు.. ధృవస్త్ర వేరియంట్ అనేది వైమానిక దళానికి అందనుంది.
డిఫెన్స్ తయారీలో బబలోపేతం అవుతున్న భారతదేశం..
హెలికాప్టర్‌తో ప్రయోగించే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ దిగుమతిని భారత ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో హెలీనా పరీక్షను నిర్వహించారు. రక్షణ రంగంలో స్వావలంబనను పెంపొందించడానికి అనేక ఆయుధాలు, వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే యోచనలో భారత్ ఉంది. వచ్చే ఐదేళ్లలో 101 ప్రధాన రక్షణ పరికరాల దిగుమతిని ఆపేసేలా ఏప్రిల్ 8న ఇండియా నిషేధిత జాబితాలో చేర్చింది. 2020 ఆగస్టు, 2021 మే నెలలో ఇలాంటి రెండు జాబితాలను రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దిగుమతుల నిషేధంతో ప్రతి సంవత్సరం రూ.3,000ల కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. 2021లో జరిగిన మొత్తం ప్రపంచ ఆయుధ విక్రయాలలో భారతదేశ రక్షణ దిగుమతులే 11 శాతం ఉన్నాయి. దిగుమతి నిషేధిత జాబితాలోని మిలిటరీ హార్డ్‌వేర్, తేలికపాటి ట్యాంకులు, నావికా దళం వినియోగించే హెలికాప్టర్లు, మౌంటెడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మీడియం ఆల్లిట్యూడ్- లాండ్ ఎండ్యూరెన్స్ UAV మరియు విసైల్స్ ఉన్నాయి.
కోడలిపై మామ లైంగిక దాడికి ప్రయత్నం.. స్నేహితుడి భార్యతో మరో వ్యక్తి అలా..
శాంట్‌లో చేరిన హెలీనా..
2021 డిసెంబర్‌లో హెలికాప్టర్ లాంచ్డ్ స్టాండ్-ఆఫ్ యాంటీ ట్యాంక్ (SANT) మిసైల్‌ను ఇండియా విజయవంతంగా పరీక్షించింది. IAF రష్యాకు చెందిన Mi-35 హెలికాప్టర్లలో అమర్చిన 10 కి.మీ పరిధి SANT మిసైల్స్. ఎమ్‌ఐ-35లో ప్రస్తుతం ఉన్న రష్యాకు చెందిన ష్టుర్మ్ మిసైల్ పరిధి ఐదు కి.మీ మాత్రమే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.