Home /News /national /

INDIA SUPPLYING PARACETAMOL TABLETS TO 120 COUNTRIES BN

రెండు నెలల్లో 120 దేశాలకు భారత్ సాయం.. ఏం చేసిందంటే..

పీయుష్ గోయెల్

పీయుష్ గోయెల్

భారత్ 120 దేశాలకు పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేశామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే ఇందులో 40కి పైగా దేశాలు ఈ మాత్రలను ఉచితంగా లేదా గ్రాంట్ రూపంలో వీటిని స్వీకరించామని మంత్రి చెప్పుకొచ్చారు.

    కరోనా వైరస్ వ్యాప్తి నేపత్యంలో ఏర్పడిన ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ పక్క దేశాలకు సాయపడింది. అది ఒకటీ రెండూ దేశాలకు కాదండోయ్.. ఏకంగా గడిచిన రెండు నెలల కాలంలో 120 దేశాలకు భారత్ సాయమందించింది. భారత్ 120 దేశాలకు పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేశామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశీయ అవసరాలకు సరిపడా పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను నిల్వ చేసుకున్నాకే వాటిని ఇతర దేశాలకు సరఫరా చేశామని చెప్పారు. ధనిక, శక్తివంతమైన దేశాలు మాత్రమే కాక వెనుకబడిన దేశాలు సైతం ఈ మాత్రలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రల ఎగుమతులపై నిబంధనలు విధించినట్టు వెల్లడించారు. అయితే ఇందులో 40కి పైగా దేశాలు ఈ మాత్రలను ఉచితంగా లేదా గ్రాంట్ రూపంలో వీటిని స్వీకరించామని మంత్రి చెప్పుకొచ్చారు.

    ఇటీవల ప్రధాని పిలుపు మేరకు స్వావలంబ భారత్ నినాదం గురించి పేర్కొంటూ ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తూనే వారిపై పూర్తిగా ఆధారపడకుండా నాణ్యమైన దేశీయ ఉత్పత్తులను, పోటీ ధరలకు అమ్మడం ఆ నినాదం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని పీయూష్ వివరించారు. ఇది సదుద్దేశం మాత్రం కొందరికి అర్థంకాకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Piyush Goyal, Pm modi, Union government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు