INDIA SUCCESSFULLY TESTFIRES SURFACE TO SURFACE BRAHMOS SUPERSONIC CRUISE MISSILE IN ANDAMAN NICOBAR MKS
BrahMos Missile: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం.. అండమాన్ దీవుల్లో..
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష
భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా భావించే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. అండమాన్-నికోబార్ దీవుల్లో బుధవారం భారత ఆర్మీ టెస్ట్ ఫైర్ జరిపింది.
భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా భావించే, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నవాటిలో వేగవంతమైనదిగా పరిగణించే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. రక్షణ పరికరాల తయారీ సంస్థ డీఆర్డీవో రష్యా సహకారంతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణితో భూతలం నుంచి భూతలానికి, భూమి నుంచి యుద్ధ విమానాలు, యుద్ద నౌకల వంటి టార్గెట్లనూ ధ్వంసం చేయొచ్చు. ఇవాళ ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించారు.
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని అండమాన్-నికోబార్ దీవుల్లో బుధవారం భారత ఆర్మీ చేపట్టింది. ఎక్కువ దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి కచ్చితత్వంతో చేధించిందని అధికారులు ప్రకటించారు. ఈ పరీక్ష విజయవంతం అయినందుకు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్.చౌదరి రక్షణ శాఖను అభినందించారు. అండమాన్-నికోబార్ దీవుల్లోనే మకాం వేసిన చౌదరి యుద్ధ సన్నాహాలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరుపుతున్నారు.
ఇటీవల మిస్‌ఫైర్‌తో పాకిస్తాన్లోకి ఓ సూపర్ సోనిక్ మిస్సైల్ దూసుకెళ్లి పేలిపోయిన విషయం తెలిసిందే. అది బ్రహ్మోస్ క్షిపణే అనే కథనాలు వచ్చినప్పటికీ ఏరకం మిస్సైల్ అనేదానిని మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ఆ ఘటనపై ఎయిర్ వైస్ మార్షల్ సమగ్ర విచారణ జరుపుతున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేస్తామని, ఆ తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రమాదవశాత్తు జరిగిన ఘటనపై ఇప్పటికే భారత్ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ లోకి భారత మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సైతం ఆదేశించినట్లు ఈ నెల 15న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పార్లమెంట్‌కు తెలిపారు. భారత క్షిపణి వ్యవస్థ పూర్తిగా సురక్షితమైందని, భారత సాయుధ దళాలు వ్యవస్థలను పూర్తిగా నిర్వహించే సామర్థ్యంతో ఉన్నాయని స్పష్టం చేశారు. మిస్సైల్ మిస్‌ఫైర్‌పై పాక్ అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నిస్తున్నది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.