Agni 4 Missile Test : పరిజ్ఞానంతో రూపొందించిన శక్తివంతమైన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి IRBM బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4(Agni-4)ను సోమవారం ఇండియన్ ఆర్మీ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా(Odisha)లోని చాందీపూర్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో(APJ Abdul Kalam Island) సోమవారం రాత్రి 7.30 గంటలకు అగ్ని-4 పరీక్ష జరిగింది. సాధారణ శిక్షణలో భాగంగా సైనిక దళాల్లోని వ్యూహాత్మక కమాండ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. క్షిపణికి సంబంధించి అన్ని అంశాలు, విశ్వసనీయతను ఈ పరీక్ష ధ్రువీకరించిందని అధికారులు చెప్పారు. ఇది మూడవ తరం అత్యంత అధునాతన మరియు ప్రాణాంతక క్షిపణి, ఇది కేవలం 20 నిమిషాల్లో చైనా-పాకిస్తాన్‌లోని ఏదైనా నగరాన్ని పేల్చివేయగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు తెలిపాయి. దీనిని DRDO అభివృద్ధి చేసింది.
అగ్ని-4 క్షిపణి పొడవు 20 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు. ఈ క్షిపణి బరువు 17 టన్నులు. ఈ క్షిపణికి 1000 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. విజయవంతమైన ఈ క్షిపణి పరీక్ష విశ్వసనీయమైన కనీస నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే భారతదేశ విధానాన్ని పునరుద్ఘాటిస్తుంది అని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగం అన్ని కార్యాచరణ పారామితులు, క్షిపణి వ్యవస్థ విశ్వసనీయతను ధ్రువీకరించిందని పేర్కొంది.
Train Derailment : పట్టాలు తప్పిన రైలు..21 మంది మృతి,50 మందికి పైగా గాయాలు
Fire Accident : మెట్రో పార్కింగ్ లో భారీ అగ్ని ప్రమాదం...కాలి బూడిదైన వాహనాలు
అగ్ని-IV అగ్ని శ్రేణి క్షిపణులలో నాల్గవది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని అంతకుముందు అగ్ని II ప్రైమ్ అని పిలిచేవారు. ఈ అగ్ని క్షిపణిని చాలాసార్లు పరీక్షించారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ క్షిపణిని పరీక్షించారు. ఇది మొదటిసారి 11 డిసెంబర్ 2010న పరీక్షించబడింది. గతేడాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇది 1000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. . ఈ క్షిపణిని ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి 27 అక్టోబర్ 2021న ప్రయోగించారు. ఈ అత్యాధునిక క్షిపణులను భారత్‌లో విజయవంతంగా పరీక్షించడం వల్ల ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలకు నిద్ర పట్టడం లేదంట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.