Agni-5: చైనాకు హెచ్చరిక.. భారత్ అమ్ములపొదిలో చేరిన అగ్ని-5.. ప్రయోగం విజయవంతం

ప్రతీకాత్మక చిత్రం

Agni-5: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అగ్ని-5‌ను డీఆర్‌డీవో రూపొందించింది. అంతకుమందు రూపొందించిన అగ్ని మిసైల్స్ కంటే అగ్ని-5 మరింత మెరుగైంది.

  • Share this:
    భారత్‌తో కొంతకాలం నుంచి డ్రాగన్ దేశం కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ.. భారత్ ధీటైన సంకేతాలు పంపింది. అగ్ని 5 క్షిపిణిని విజయవంతం ప్రయోగించింది. కొన్ని నెలల క్రితమే పరీక్షలు జరుపుకొన్న 'అగ్ని ప్రైమ్‌' క్షిపణి సహా మిగిలిన అగ్ని సిరీస్‌లోని ఆయుధాలన్నీ పాకిస్థాన్‌(Pakistan)ను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసినవి. అయితే అగ్ని 5 వాటికి పూర్తి భిన్నం. చైనా (China) భూభాగం మొత్తం దాడి పరిధిలోకి తెచ్చేలా తయారు చేశారు. అగ్ని-5 రూపొందించడంతో ఈ తరహా మిసైల్స్ ఉన్న చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల సరసన భారత్‌ చేరింది. నిన్న ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి దీన్ని ప్రయోగించారు. తొలిసారి రాత్రి సమయంలో భారత్ క్షిపిణిని ప్రయోగించింది. ఒకటిన్నర టన్ను యుద్ధసామాగ్రిని మోసుకెళ్లే సామర్థ్యం అగ్ని-5 సొంతం.

    పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అగ్ని-5‌ను డీఆర్‌డీవో (DRDO) రూపొందించింది. అంతకుమందు రూపొందించిన అగ్ని మిసైల్స్ కంటే అగ్ని-5 మరింత మెరుగైంది. దీనిని గొట్టం వంటి పరికరం నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీని వల్ల క్షిపణిని రైలు, రోడు మార్గాల్లో సురక్షితంగా తరలించి ప్రయోగించే అవకాశం లభిస్తుంది. ఇక వార్‌ హెడ్‌ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో శబ్ద వేగం కంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది.

    Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

    Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

    ఈ క్రమంలో వార్‌ హెడ్‌ దెబ్బ తినకుండా దేశీయంగా తయారు చేసిన హీట్‌ షీల్డ్‌ను అమర్చారు. ఇది లోపల వైపు వేడిని 50డిగ్రీల సెల్సియస్‌ లోపే ఉండేట్లు చూస్తుంది. మరోవైపు భారత్‌ అగ్ని-5ను పరీక్షించనుందనే విషయాన్ని తెలుసుకున్న చైనా.. సెప్టెంబర్‌ 16న దీనిపై స్పందించింది. భారత్‌ వల్ల దక్షిణాసియాలో సుస్థిరత, శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని చైనా ఆరోపించింది. ప్రస్తుతం భారత్ దగ్గర 156 అణ్వాయుధాలు ఉండగా, చైనా దగ్గర 350, పాకిస్థాన్ దగ్గర 165 అణ్వాయుధాలు ఉన్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: