ఇంత నీచమా.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు గట్టి జవాబిచ్చిన భారత్..

ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ

దాయాది పాకిస్తాన్ తన దుర్భుద్దిని బయటపెట్టింది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని ప్రదర్శించింది.

  • Share this:
    కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కుల, మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి చికిత్స అందిస్తోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తోంది. అయితే, దాయాది పాకిస్తాన్ తన దుర్భుద్దిని బయటపెట్టింది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని ప్రదర్శించింది. మర్కజ్ ఘటన అనంతరం దేశంలో కరోనా కేసులు ఎక్కువైన విషయం తెలిసిందే. అయితే, ముస్లింలపై భారత్ వివక్ష చూపుతోందంటూ వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది.

    వాళ్ల దేశంలో ఉన్న అంతర్గత విషయాలను పక్కకు తోసేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని తిప్పికొట్టింది. కోవిడ్‌పై దృష్టి పెట్టాల్సిందిపోయి, తోటి దేశంపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది. పాకిస్తాన్ ఏ స్థాయిలో మైనారిటీలపై వివక్ష ప్రదర్శిస్తున్నదో తెలుసంటూ పాక్‌కు చురకలు అంటించింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: