మా మధ్య తలదూర్చొద్దు.. భారత్‌కు చైనా వార్నింగ్..

ప్రతీకాత్మకచిత్రం

అమెరికాకు, చైనాకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలో తలదూర్చవద్దని భారత్‌ను డ్రాగన్ దేశం హెచ్చరించింది.

  • Share this:
    అమెరికాకు, చైనాకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలో తలదూర్చవద్దని భారత్‌ను డ్రాగన్ దేశం హెచ్చరించింది. అమెరికాకు మద్దతు ఇచ్చినా, ఎలాంటి చర్యలకు పూనుకున్నా అది భారత్‌, చైనా మధ్య బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా, చైనా వివాదంలో వేలు పెడితే లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుందన్న విషయాన్ని భారత్ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికింది. అయితే, ఈ వ్యవహారంపై అమెరికా దీటుగా స్పందించింది. తమ సైన్యం భారత్‌, ఆస్ట్రేలియా వంటి స్నేహితులకు కూడా అండగా ఉంటుందని ఆ దేశ సెక్రటరీ మైక్‌ పాంపియో అన్నారు.

    డ్రాగన్ దేశం భారత్‌-చైనా సరిహద్దుల్లోని వ్యూహాత్మక పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకుంటోందని, తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇటు భారత సరిహద్దులో, అటు దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశం దూకుడుగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా, భారత్‌తో సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని చైనా పేర్కొనడం గమనార్హం.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: