జూలై చివరి నాటికి భారత్ చేతికి రాఫెల్ యుద్ధ విమానాలు..

ప్రతీకాత్మక చిత్రం

Rafale Jet : చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు భారత్‌కు రానున్నాయి.

  • Share this:
    Rafale Jet : చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు భారత్‌కు రానున్నాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో రెండు నెలలు ఆలస్యమైన జెట్లు.. జూలై చివరి నాటికి భారత్‌కు ఫ్రాన్స్ అందించనుంది. నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు అందించనున్నట్లు.. అందులో మూడు రెండు సీట్ల విమానాలు, ఒకటి సింగిల్ సీటర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంబాలా ఎయిర్‌బేస్‌కు ఈ విమానాలు రానున్నాయి. ఈ యుద్ధ విమానాల కొనుగోలులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ ఆర్‌కే బదౌరియాకు సముచిత గౌరవం ఇవ్వనున్నారు. విమానాల టెయిల్ నెంబర్లకు ఆర్‌కే సిరీస్ ఇవ్వనున్నారు. 17 గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ పైలట్ తొలి విమానాన్ని భారత్‌కు తీసుకురానున్నారు.

    రాఫెల్ యుద్ధ విమానాలను నడిపేందుకు ఏడుగురితో కూడిన భారతీయ పైలట్ల బృందం ఫ్రెంచ్ ఎయిర్‌బేస్‌లో శిక్షణ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో బృందం కూడా ఫ్రాన్స్‌కు వెళ్లనుంది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో రూ.60 వేల కోట్ల డీల్‌ను భారత్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ జెట్ల రాకతో భారత వాయుసేన మరింత పటిష్ఠం కానుంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: