Home /News /national /

India Russia summit : 2ప్లస్2 మీటింగ్ లో కీలక ఒప్పందాలపై సంతకాలు -రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీ

India Russia summit : 2ప్లస్2 మీటింగ్ లో కీలక ఒప్పందాలపై సంతకాలు -రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీ

భారత్, రష్యా రక్షణ ఒప్పందాలపై రాజ్ నాథ్ సంతకం, రష్యా మంత్రితో జైశంకర్ భేటీ

భారత్, రష్యా రక్షణ ఒప్పందాలపై రాజ్ నాథ్ సంతకం, రష్యా మంత్రితో జైశంకర్ భేటీ

భారత్-రష్యా 21వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా రెండు దేశాల మధ్య తొలిసారి 2 ప్లస్ 2 సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి సెర్జి షోయ్ తో చర్చలు జరిపి, కీలక ఒప్పందాలపై సంతకాలు చేయగా, మరోవైపు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్జీలావ‌రోవ్ తో భేటీ అయి, కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇతకుముందు జరిగిన శిఖరాగ్ర సదస్సుల్లో దేశాధినేతలు మాత్రమే చర్చలు జరుపుకోగా, ఈసారి 2 ప్లస్ 2 మీటింగ్ పేరుతో రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య కూడా చర్చలు, ఒప్పందాలు జరిగాయి.

ఇంకా చదవండి ...
రష్యాతో బంధానికి భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశకర్ అన్నారు. భారత్-రష్యా 21వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా రెండు దేశాల మధ్య తొలిసారి 2 ప్లస్ 2 సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి సెర్జి షోయ్ తో చర్చలు జరిపి, కీలక ఒప్పందాలపై సంతకాలు చేయగా, మరోవైపు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్జీలావ‌రోవ్ తో భేటీ అయి, కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇతకుముందు జరిగిన శిఖరాగ్ర సదస్సుల్లో దేశాధినేతలు మాత్రమే చర్చలు జరుపుకోగా, ఈసారి 2 ప్లస్ 2 మీటింగ్ పేరుతో రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య కూడా చర్చలు, ఒప్పందాలు జరిగాయి. ఇవాళ సాయంత్రం భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని మోదీతో భేటీ అవుతారు. అధినేతల సమావేశానికి ముందే మంత్రుల స్థాయిల్లో ఒప్పందాలపై సంతకాలు జరగడం గమనార్హం.

రష్యా రక్షణ మంత్రి సెర్జి షోయ్ బృందంతో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బృందం జరిపిన చర్చల్లో ఏకే 203 రైఫిల్స్ తయారీ, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు ప్రధానాంశాలుగా ఉన్నాయి. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ విధానాన్ని అవలంభిస్తోన్న భారత్.. రష్యా సహకారంతో 5ల‌క్ష‌ల ఏకే-203 అజాల్ట్ రైఫిళ్ల‌ను ఉత్ప‌త్తి చేసేంద‌కు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లోనే వీటిని తయారు చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు కుదిరిన ఒప్పందాలపై రెండు దేశాల రక్షణ మంత్రులు ఇవాళ సంతకాలు చేశారు.

చెల్లెలితో కాపురానికి భర్తను ఒప్పించిన భార్య -ఆ తర్వాత జరిగిన ట్విస్టులు మామూలుగా ఉండవు..



‘భారత్, రష్యా భాగస్వామ్యంలో రక్షణ సహకారం మూలస్తంభంగా ఉంటోంది. మన రెండు దేశాల మధ్య స్నేహం.. ప్రపంచ శాంతికి పరిరక్షణగా, ప్రాంతీయ అభివృద్దికి స్థిరత్వాన్ని ఇచ్చేదిగా ఉంది. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతోన్న దరిమిలా భారత్-రష్యా వార్షిక సదస్సు తన ప్రాముఖ్యతను చాటుకుంది. పరస్పర అవగాహన, విశ్వాసం, ఆసక్తుల ఆధారంగా భారత్, రష్యా కలిసి ముందుకెళుతున్నాయి..’అని ప్రారంభ వాక్యాలుగా రాజ్ నాథ్ పేర్కొన్నారు. రష్యా రక్షణ మంత్రి సెర్జి షోయ్, రాజ్ నాథ్ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు

ind-pak సరిహద్దులో పురుడు పోసుకున్న మహిళ -బుడ్డోడికి ‘బోర్డర్’అని పేరు -వాళ్లదిప్పుడు ఏ దేశం?



2 ప్లస్ 2 సమావేశంలో భాగంగా అటు రక్షణ మంత్రులు భేటీకాగా, మరోవైపు భారత్, రష్యా విదేశాంగ మంత్రులు జైశంకర్, సెర్జీలావ‌రోవ్ తమ బృందాలతో సమావేశమయ్యారు. జియోపొలిటికల్ వాతావరణం మారుతున్న క్రమంలో భారత్-రష్యాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాముఖ్యతను ఈ సదస్సు మరోసారి ధృవీకరించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది(2021)లోనే భారత్, రష్యా మధ్య నాలుగు దఫాలుగా అత్యున్నత స్ధాయి చర్చలు జరిగాయని, శిఖరాగ్ర సదస్సులో తొలిసారి 2 ప్లస్ 2 సమావేశాలు జరుగుతున్నాయని, ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ జరపబోయే చర్చల్లోనూ ఆశాజనక ఫలితాలు వస్తాయని మంత్రి జైశంకర్ అన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: India, Pm modi, Rajnath Singh, Russia, Vladimir Putin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు