హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

E-Tourist visa: 156 దేశాలకు మళ్లీ ఈ-వీసాలు.. అమెరికా, జపాన్ జాతీయులైతే 10ఏళ్లు!

E-Tourist visa: 156 దేశాలకు మళ్లీ ఈ-వీసాలు.. అమెరికా, జపాన్ జాతీయులైతే 10ఏళ్లు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈనెల 27 నుంచి భారత్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను పున:ప్రారంభించనున్న క్రమంలో ఈ-వీసా విధానాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది. 156 దేశాల పౌరులకు ఇ-టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించింది.

కరోనా మహమ్మారి దెబ్బకు రెండేళ్లుగా కుదేలైన విమానయాన రంగాన్ని మళ్లీ గాడిలోకి తెచ్చే దిశగా ఈనెల 27 నుంచి భారత్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసుల(International Flight Services)ను పున:ప్రారంభించనున్న క్రమంలో ఈ-వీసా (E-Visa)విధానాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది. 156 దేశాల పౌరులకు ప్రస్తుతం చెల్లుబాటయ్యే ఐదేళ్ల ఇ-టూరిస్ట్ వీసాలు(E-Tourist Visa) తక్షణమే అమల్లోకి వచ్చేలా భారత్ పునరుద్ధరణ నిర్ణయాన్ని ప్రకటించింది.

కరోనా వరుస వేవ్ ల నేపథ్యంలో భారత్ దాదాపు అన్ని దేశాల పౌరులకు ఈ-టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేయడం తెలిసిందే. మళ్లీ రెండేళ్లకు.. కొవిడ్ తీవ్రత తగ్గిన దరిమిలా ఆయా దేశాల పౌరులకు వాటిని పునరుద్దరించింది. కాగా, మిగతా అన్ని దేశాలకూ ఈ-టూరిస్ట్ వీసా కాలపరిమితి 5ఏళ్లుకాగా, అమెరికా, జపాన్ జాతీయులకు మాత్రం వీసా గడువు పాత పద్ధతిలోనే 10ఏళ్లు ఉటుంది.

Crude Oil: భారత్‌కు భారీగా రష్యా క్రూడ్ ఆయిల్.. భగ్గుమన్న అమెరికా.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి సమర్థనా?

2020 మార్చి నుంచి సస్పెన్షన్ లో ఉంచిన, ప్రస్తుతం చెల్లుబాటయ్యే ఈ-టూరిస్ట్ వీసాను 156 దేశాల పౌరులకు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విదేశాంగ శాఖ ఉన్నత అధికారి ఒకరు తెలిపినట్లు పీటీఐ పేర్కొంది. వీసా మాన్యువల్-2019 ప్రకారం ఈ 156 దేశాల జాతీయులు కూడా తాజా ఇ-టూరిస్ట్ వీసా జారీకి అర్హులు. ఐదు సంవత్సరాల చెల్లుబాటుతో ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే రెగ్యులర్ (పేపర్) టూరిస్ట్ వీసా పునరుద్ధరిస్తారు. కాలానుగుణంగా విధించిన పరిమితులకు లోబడి అర్హతగల దేశాల జాతీయులకు ఐదేళ్ల వరకు తాజా రెగ్యులర్ (పేపర్) టూరిస్ట్ వీసా కూడా జారీ చేయబడుతుందని అధికారి తెలిపారు.

Bullet Train: హైదరాబాద్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. వయా చిట్యాల-జగ్గయ్యపేట -మంచి లాభం: Uttam

కరోనా కారణంగా రెండేండ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఈ-టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. కరోనా కాలంలో భారత్ 30కిపైగా దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పందాలు చేసుకొని అత్యవసర సర్వీసులను నడిపింది. కాగా, విమానాల్లో ఎయిర్‌ బబుల్‌ పద్ధతి కూడా ఈనెల 27 నుంచి రద్దుకానుంది.

First published:

Tags: Covid, Flights, Tourism, Visa

ఉత్తమ కథలు