అయోధ్యలో రామాలయ నిర్మాణంపై పాకిస్థాన్ పిచ్చికూతలు..

అయోధ్యలో రామాలయ నిర్మాణంపై పాకిస్థాన్ నోరుపారేసుకుంది. ఇక్కడ రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతివ్వడం దోషపూరితమైన తీర్పుగా అభివర్ణించింది.

news18-telugu
Updated: August 6, 2020, 6:19 PM IST
అయోధ్యలో రామాలయ నిర్మాణంపై పాకిస్థాన్ పిచ్చికూతలు..
ఇమ్రాన్ ఖాన్ (Credit - Twitter - PTI)
  • Share this:
భారత్ అంతర్గత వ్యవహారాల్లో మరోసారి పాకిస్థాన్ జోక్యం చేసుకుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై పిచ్చికూతలు కూసింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దోషపూరితమైనదంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్‌లో మైనార్టీయిజం పెచ్చుమీరుతోందని... మైనార్టీలు..మరీ ముఖ్యంగా ముస్లీంలు, వారి ప్రార్థనా స్థలాలపై దాడులు మితిమీరుతున్నాయంటూ తన కటనలో పేర్కొంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుమతించడం ద్వారా మైనార్టీల విశ్వాసాలను కాలరాసిందని...వారికి న్యాయాన్ని నిరాకరించిందని పేర్కొంది. బాబ్రీ మసీదును కూల్చివేసిన చోట రామాలయ నిర్మాణం చేపట్టడాన్ని ఖండిస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(ఓఐసీ) తీర్మానం చేసినట్లు ఆ ప్రకటనలో పాక్ పేర్కొంది. భారత్‌ను ‘హిందూ దేశం’గా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ పాక్ అడ్డగోలు ప్రకటన చేసింది.

దీనిపై భారత విదేశాంగ శాఖ పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం అవసరం లేదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవత్సవ పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ...సొంత మైనార్టీలు, వారి మత హక్కులను కాలరాస్తున్న పాకిస్థాన్...అయోధ్యలో రామాలయ నిర్మాణం విషయంలో దీనికి భిన్నంగా స్పందిస్తుందని ఆశించలేమని పేర్కొన్నారు.
Published by: Janardhan V
First published: August 6, 2020, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading