హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

దెబ్బ అదుర్స్ కదూ : బ్రిటన్ ను వెనక్కి నెట్టేసి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

దెబ్బ అదుర్స్ కదూ : బ్రిటన్ ను వెనక్కి నెట్టేసి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

Image source(Shutterstock)

Image source(Shutterstock)

India Overtakes UK : జీడీపీ(GDP) పరంగా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ(India Economy) తాజాగా బ్రిటన్‌ ను మించిపోయింది. ప్రముఖ ఆర్థిక రంగ నివేదిక సంస్థ బ్లూమ్​బర్గ్​ తాజా రిపోర్ట్(Bloomberg Report)... ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్‌(UK) ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయిందని, భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపింది .

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

India regains fifth largest economy : కోవిడ్(Covid19) కారణంగా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతో క్షిణించాయి. ఒక్కసారిగా వృద్ధిరేటు పడిపోయింది. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వివిధ రంగాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. అయితే చితికిపోయిన ఆర్థికవ్యవస్థను గాడిలోపెట్టేందుకు గత కొన్ని నెలలుగా కేంద్రప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితమిస్తున్నాయి. క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. జీడీపీ(GDP) పరంగా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ(India Economy) తాజాగా బ్రిటన్‌ ను మించిపోయింది. ప్రముఖ ఆర్థిక రంగ నివేదిక సంస్థ బ్లూమ్​బర్గ్​ తాజా రిపోర్ట్(Bloomberg Report)... ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్‌(UK) ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయిందని, భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపింది.భారత్ 5వ స్థానానికి చేరుకోవడంతో..బ్రిటన్ 6వ స్థానానికి పడిపోయినట్లు తెలిపింది. దశాబ్దం క్రితం భారత్​ 11 స్థానంలో ఉండగా.. బ్రిటన్​ ఐదో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. జీడీపీ పరంగా ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ మాత్రమే మన దేశానికంటే ముందున్నాయి.

అమెరికా డాలర్ల ప్రకారం ఈ తాజా అంచనాలను రూపొందించినట్లు బ్లూమ్​బర్గ్ తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ఆధారంగా చూస్తే 2021 డిసెంబరు నాటికే భారత ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయికి చేరింది. మార్చి త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ మరింత పెరిగి 854.7 మిలియన్ డాలర్లుగా ఉండగా.. యూకే ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 మిలియన్ డాలర్లుగా ఉంది. తొలి త్రైమాసికం జీడీపీ వివరాలను భారత ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజుల తర్వాత బ్రిటన్‌‌ను భారత్ వెనక్కినట్టు వెల్లడైంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్​ కు ఇది ఎదురుదెబ్బేనని బ్లూమ్​బర్గ్​ తెలిపింది. ఆర్థిక కష్టాలతో బ్రిటన్‌ మరింత చితికిపోతుందని భావిస్తున్నారు. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం వార్షిక ప్రాతిపాదికన కూడా భారత్ ఈసారి యూకేను వెనక్కి నెట్టనుంది.

INS Vikrant : శత్రుదేశాలకు చుక్కలే..తొలి స్వదేశీ యుద్ధనౌక INS విక్రాంత్ ను ప్రారంభించిన మోదీ

ఆర్థిక సమస్యలు, రాజకీయ మార్పులతో బ్రిటన్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. యూకేలో కొత్త ప్రధాని ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో బ్రిటన్ కు కొత్త ప్రధాని రానున్న విషయం తెలసిందే. ప్రధానంగా విదేశాంగ సెక్రటరీ లిస్ ట్రస్, భారత సంతతికి చెందిన మాజీ ఛాన్సలర్​ రిషి సునక్ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికి.. లిస్ ట్రస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌‌లో యూకే ర్యాంక్ దిగజారడం నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తికి ఇబ్బందికరంగా మారనుంది. కానీ నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. బ్రిటన్ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం తలెత్తిన తరుణంలో కొత్తగా ఎన్నికయ్యే ప్రధానమంత్రి వీటిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక మాంద్యం 2024 మే వరకు కొనసాగుతుందని బ్యాంక్​ ఆఫ్​ ఇంగ్లాండ్​ అంచనా వేసింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: GDP, India, Uk

ఉత్తమ కథలు