హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Covid 19 : ఒక్కరోజులో 3వేలకు పైగా కేసులు.. భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం

Covid 19 : ఒక్కరోజులో 3వేలకు పైగా కేసులు.. భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Covid 19 : ఇండియాలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజు 3వేలకు పైగా కేసులు వచ్చాయంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మళ్లీ మాస్కులు వాడక తప్పని పరిస్థితి కనిపిస్తోందిగా.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో తాజాగా గత 24 గంటల్లో కొత్త కేసులు 3,016 నమోదయ్యాయి. (ఇవి బుధవారం రోజంతా నమోదైన కేసులు). మంగళవారంతో పోల్చితే.. నిన్న కేసులు 40 శాతం ఎక్కువగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. 6 నెలల్లో ఇవే అత్యధిక కేసులు. ఇప్పుడు డైలీ పాజిటివిటీ రేటు 2.7 శాతం అవ్వగా... వారపు పాజిటివిటీ రేటు 1.71 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో 2022 అక్టోబర్ 2న 3,375 కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు నమోదయ్యాయి.

నిన్న ఒక్కరోజే కరోనాతో 14 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,30,862కి చేరింది. నిన్న మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు చనిపోగా... కేరళలో ఏకంగా 8 మంది చనిపోయారు. ఇప్పుడు కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.

ఇప్పుడు మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతంగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,41,68,321కి చేరింది.

ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఈ వారంలో ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. జనవరి 16న ఢిల్లీలో కరోనా కేసులు 0గా ఉడేవి. ఇప్పుడో.. గత 24 గంటల్లో ఏకంగా 300 కేసులు నమోదయ్యాయి. దాంతో ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం రివ్యూ మీటింగ్ పెట్టుకుంటోంది. దీనికి హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్ డాక్టర్లు తదితరులు హాజరుకాబోతున్నారు.

మహారాష్ట్రలో ముంబై, పుణె, థానే, సంగ్లీ లాంటి జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు బూస్టర్ డోస్ తీసుకోకపోవడం వల్లే ఇలా అవుతోందని ప్రభుత్వం అంటోంది. మహారాష్ట్రలో కోటి మంది కూడా బూస్టర్ డోస్ తీసుకోలేదని అధికారులు అంటున్నారు.

ఇప్పుడు ఎవర్ని ఎవరు నిందించుకొని ఏం లాభం.. కరోనా అయితే ఇండియాలో జోరుగా ఉందన్నది నిజం. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఇవాళ ఎన్ని కేసులు వస్తాయో..!

First published:

Tags: Corona, Corona alert, Corona bulletin, Corona cases, Corona deaths

ఉత్తమ కథలు