INDIA READY TO SUPPLY FOOD STOCK TO WORLD IF WORLD TRADE ORGANISATION PERMITS SAYS PRIME MINISTER NARENDRA MODI GH VB
Narendra Modi: ఇండియాలోని ఆహార ధాన్యాల నిల్వలపై.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
ప్రధాని మోదీ(File)
ఇండియాలోని ఆహార ధాన్యాల నిల్వలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) అనుమతిస్తే ప్రపంచానికి ఆహార నిల్వలను సరఫరా చేయడానికి ఇండియా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తాజాగా గుజరాత్‌లోని శ్రీ అన్నపూర్ణ(Annapurna) ధామ్‌లోని హాస్టల్(Hostel), ఎడ్యుకేషన్ కాంప్లెక్స్(Education Complex( ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ(Modi) మాట్లాడుతూ.. ఇండియాలోని ఆహార ధాన్యాల నిల్వలపై (Food Stocks)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) అనుమతిస్తే ప్రపంచానికి ఆహార నిల్వలను సరఫరా చేయడానికి ఇండియా(India) సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ (Ukraine) యుద్ధంపై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో(Biden) సోమవారం జరిగిన సంభాషణలో తాను ఇదే విషయాన్ని ప్రతిపాదించినట్టు మోదీ వెల్లడించారు.
“నేడు ప్రపంచం అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిలో ప్రజలకు కోరుకున్నది లభించడం లేదు. అన్ని మార్గాలు మూసుకుపోతున్నందున పెట్రోల్, చమురు, ఎరువులు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్కరూ తమ నిల్వలను భద్రపరచుకోవాలని అనుకుంటున్నారు" అని మోదీ చెప్పుకొచ్చారు.
"ప్రస్తుతం ప్రపంచంలోని ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ కొత్త సవాల్ తో ప్రపంచం మొత్తం పోరాడుతోంది. నేను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడుతున్నప్పుడు... ఆయన కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ సమయంలో డబ్ల్యూటీవో (WTO) అనుమతి ఇస్తే, రేపటి నుంచే ప్రపంచానికి ఆహార నిల్వలను అందించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని చెప్పాను.” అని నరేంద్ర మోదీ తెలిపారు.
దేశంలో ప్రజలందరికీ సరిపోయేంత ఆహారం ఉందని, ప్రపంచానికి సైతం ఆహారం అందించేలా భారత రైతన్నలు ఏర్పాట్లు చేసుకున్నట్లు కనిపిస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్... యూఎస్ రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి మధ్య 2+2 సంభాషణకు ముందు పీఎం మోదీ, బైడెన్ సోమవారం మాట్లాడారు.
మంగళవారం గుజరాత్‌లోని శ్రీ అన్నపూర్ణ ధామ్ (Shree Annapurna Dham)లోని హాస్టల్, ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన సంప్రదాయం, సంస్కృతిలో ఆహారం (Food), ఆరోగ్యం (Health), విద్య (Education)కు చాలా ప్రాముఖ్యత ఉంది. నేడు, అన్నపూర్ణ ధామ్ దీనిపై విస్తరించింది. గుజరాత్‌లోని సామాన్య ప్రజలు శ్రీ అన్నపూర్ణ ధామ్ ప్రయత్నాల నుంచి ఎంతో ప్రయోజనం పొందుతారు." అని వివరించారు. పాటిదార్ కమ్యూనిటీని ప్రశంసిస్తూ, ప్రతి సొసైటీ తన సామాజిక బాధ్యతను నిర్వర్తించడం అనేది గుజరాత్ నేచర్ లోనే ఉందని పొగిడారు.
కెనడా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి పురాతన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. 100 ఏళ్ల క్రితం, 1913లో పవిత్రమైన వారణాసిలోని ఒక ఆలయం నుంచి ఈ అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని దొంగలించి దేశం నుంచి అక్రమంగా తరలించారు.
మంగళవారం ప్రారంభించిన హాస్టల్, ఎడ్యుకేషన్ సెంటర్ లో 150 గదులు ఉన్నాయి. 600 మంది విద్యార్థులు బస చేయవచ్చు. అక్కడ ఇతర సౌకర్యాలలో ఈ-లైబ్రరీ, ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీస్, టీవీ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, హిరమణి ఆరోగ్య ధామ్‌ను జనసహాయక్ ట్రస్ట్ అభివృద్ధి చేస్తుంది.
ఇది ఒకేసారి 14 మందికి డయాలసిస్ అందించడం సహా సరికొత్త వైద్య సదుపాయాలను కలిగి ఉంటుంది. 24 గంటల రక్త సరఫరాతో కూడిన బ్లడ్ బ్యాంక్, 24 గంటలూ పనిచేసే మెడికల్ స్టోర్, ఆధునిక పాథాలజీ లేబొరేటరీ, టాప్-క్లాస్ పరికరాలు కూడా ఉంటాయి. ఈ కేంద్రంలో ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, యోగాకు సంబంధించిన అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.