Home /News /national /

INDIA REACHES 200 CRORE COVID JAB MILESTONE 18 MONTHS AFTER FIRST SHOT PVN

Covid Vaccination : వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు..200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid vaccination in india : దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్(Covid vaccination in india)ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల పంపిణీ 200 కోట్లు దాటింది. వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల మార్క్‌ను 9 నెలల్లో చేరుకున్న భారత్...18 నెలల్లో 200 కోట్ల మార్క్‌కు చేరువైంది.

ఇంకా చదవండి ...
    Covid vaccination in india : దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్(Covid vaccination in india)ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల పంపిణీ 200 కోట్లు దాటింది. వ్యాక్సినేషన్‌ లో 100 కోట్ల మార్క్‌ను 9 నెలల్లో చేరుకున్న భారత్...18 నెలల్లో 200 కోట్ల మార్క్‌కు చేరువైంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జనవరి 16,2021న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేవలం 277 రోజుల్లోనే 100 కోట్ల మందికి వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత వేగంగా అత్యధిక వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. భారత్ కన్నా ముందు స్థానంలో ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన దేశంగా చైనా నిలిచింది. ఇప్పటివరకూ ఆ దేశం 340 కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసింది.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో...భారతదేశం మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల మార్క్ ను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగంతో అసమానంగా మార్చడానికి సహకరించిన వారికి గర్వకారణం. ఇది COVID-19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసింది"అని తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ...కేవలం 18 నెలల్లోనే 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన దేశవాసులందరికీ హృదయపూర్వక అభినందనలు అని వీడియో ప్రసంగంలో తెలిపారు.

    August 15 No Holiday : ఆగస్టు 15న సెలవు రద్దు..చరిత్రలో తొలిసారి కీలక నిర్ణయం



    అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశ జనాభాలో 96 శాతం మంది వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు. 87 శాతం మంది రెండు డోసులను వేయించుకున్నారు. భారత్‌లో ఇప్పటివరకూ పూర్తి చేసిన వ్యాక్సిన్ డోసుల్లో 71 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే పంపిణీ చేయడం గమనార్హం. ఇప్పటివరకూ పూర్తి చేసిన డోసుల్లో 5.48 కోట్ల ప్రికాషన్ డోసులు, 12-14 ఏళ్ల వయసు వారికి ఇచ్చిన 3.79 కోట్ల ఫస్ట్ డోస్ వ్యాక్సిన్లు ఉన్నాయి. రోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ 75 రోజుల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టింది. ఈసందర్భంగా 18 ఏండ్లు నిండిన వయోజనులకు ఉచితంగా బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేస్తోంది.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: COVID-19 vaccine, Vaccination

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు